Begin typing your search above and press return to search.

ఆక్సిజన్ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   28 Aug 2017 11:42 AM GMT
ఆక్సిజన్ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు
X
గోపీచంద్ సినిమా రిలీజ్ అనగానే ఆశ్చర్యంగా చూసే పరిస్థితి కనిపిస్తోంది ఈ మధ్య. ఏళ్లకు ఏళ్లు వాయిదాలు పడ్డ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాను మూడు నెలల కిందట విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలూ చేశారు. కానీ ఆ సినిమాకు రిలీజ్ రోజున బ్రేక్ పడిపోయింది. ఆ తర్వాత దాని గురించి ఏ అప్ డేట్ లేదు. ఇప్పుడు గోపీచంద్ నటించిన మరో లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘ఆక్సిజన్’ రిలీజ్ గురించి ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 12న విడుదల చేస్తారట. చాన్నాళ్లుగా వార్తల్లో లేని ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం ప్రెస్ నోట్ ఇచ్చాడు.

గోపీచంద్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని.. దర్శకుడు జ్యోతి కృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ ఏంటన్నది సినిమా విడుదలయ్యాక తెలుస్తుందని.. యువన్ శంకర్ రాజా అందించిన ఆడియోను త్వరలోనే రిలీజ్ చేసి.. అక్టోబరు 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని ప్రకటించారు. జ్యోతికృష్ణ ఎ.ఎం.రత్నం కొడుకే అన్న సంగతి తెలిసిందే. ఐతే గోపీచంద్ .. జ్యోతికృష్ణ మధ్య విభేదాల వల్లే ఈ సినిమా ఆలస్యమైందన్న వార్తలొచ్చాయి. ‘గౌతమ్ నంద’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా గోపీ మాట్లాడుతూ.. ‘ఆక్సిజన్’ సంగతి తనకు తెలియదంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఉన్నట్లుండి ప్రెస్ నోట్ వచ్చింది. ఐతే అక్టోబరు 12న ‘రాజా ది గ్రేట్’.. 13న ‘రాజు గారి గది-2’ లాంటి క్రేజీ సినిమాలు వస్తుండగా.. ‘ఆక్సిజన్’కు అవకాశముంటుందా అన్నది డౌటు.