Begin typing your search above and press return to search.

మూడు సినిమాలతో వచ్చే ఏడాది ఆక్సిజన్

By:  Tupaki Desk   |   7 Dec 2016 4:34 AM GMT
మూడు సినిమాలతో వచ్చే ఏడాది ఆక్సిజన్
X
2016లో ఒక్క మూవీ కూడా రిలీజ్ చేయలేదు హీరో గోపీచంద్. సౌఖ్యం ఫ్లాప్ నుంచి వీలైనంత త్వరగా బయటపడి ట్రాక్ లోకి వచ్చేయాలని గోపీచంద్ ప్లాన్ చేస్తే అన్నీ రివర్స్ అయిపోయాయ్. దీంతో ఈ ఏడాది వస్తాయనుకున్న సినిమాలన్నీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిపోయాయ్.

నిజానికి ఆక్సిజన్ మూవీ దీపావళికే రావాలి. అయితే చిత్ర దర్శకుడు ఏఎం జ్యోతిక్రిష్ణతో డిఫరెన్సెస్ రావడంతో అది కాస్తా షూటింగ్ డీలే అయింది. ఫైనల్ గా గోపీచంద్- జ్యోతిక్రిష్ణ మధ్య రాజీ కుదరడంతో మళ్లీ మూవీకి ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రానుంది. ఇక అగ్ర దర్శకుడు బి.గోపాల్ డైరెక్షన్లో రెండేళ్ల క్రితం మొదలై ఆగిపోయిన సినిమా కూడా మళ్లీ పట్టాలెక్కింది. ఈ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

వీటితో పాటు సంపత్ నంది డైరెక్షన్లో మరో మూవీలో యాక్ట్ చేస్తున్నాడు గోపీచంద్. ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాని 2017 సమ్మర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అంటే ఇన్ని రోజులు మూలపడ్డ సినిమాలన్నింటికి వచ్చే ఏడాది మోక్షం వస్తుందనుకోవాలి. అయితే ఇప్పటికే చాలామంది తమ సినిమాల కోసం 2017 కేలండర్ మీద కర్చీఫ్ లు వేసేశారు. వీటి మధ్యలో గోపీచంద్ చిత్రాలు ఎప్పుడు వస్తాయో.. ఎన్ని హిట్ కొడతాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/