Begin typing your search above and press return to search.

మాచో లుక్ లో మోడరన్ చాణక్య!

By:  Tupaki Desk   |   3 July 2019 9:01 AM GMT
మాచో లుక్ లో మోడరన్ చాణక్య!
X
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన గోపీచంద్ ప్రస్తుతం 'చాణక్య' అనే ఒక స్పై థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 12 వ తారీఖున గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి మరో పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో గోపీచంద్ మాచో లుక్ లో కనిపిస్తున్నాడు. ఒక జీప్ పక్కన స్టైలిష్ గా నిలబడి ఉన్నాడు. గడ్డం లుక్ లో కళ్ళజోడు ధరించి సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోందని సమాచారం. ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుందని.. పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంటుందని 'చాణక్య' టీమ్ మెంబర్స్ వెల్లడించారు. ఈ చిత్రం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని.. తప్పనిసరిగా ప్రేక్షకులను మెప్పిస్తుందని 'చాణక్య' మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట.

ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా బ్యూటిఫుల్ మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వెట్రి ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్. ఎ.కె.ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్రహ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ డైరెక్టర్ తిరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.