Begin typing your search above and press return to search.

'బలం' చూపించొద్దంటున్న గోపిచంద్

By:  Tupaki Desk   |   3 Oct 2016 6:26 PM IST
బలం చూపించొద్దంటున్న గోపిచంద్
X
అప్పుడెప్పుడో చిన్నప్పుడు చేసిన ఒక సినిమా.. ఇంతవరకు రిలీజ్ కాలేదు. దాదాపు ప్రతీ స్టార్ హీరో కెరియర్లోనూ ఇలాంటి సినిమాలు కొన్ని ఉంటాయిలే. అయితే ఈ తరహా సినిమాలో మన హిట్లలో ఉన్నప్పుడు బయటకొస్తే పర్లేదు కాని.. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు వస్తే మాత్రం మరింత డ్యామేజ్ చేస్తాయ్ అని నమ్ముతారు మన హీరోలు.

మొదలెట్టిన ఆరేళ్ల తరువాత రిలీజైన మెగాస్టార్ చిరంజీవి 'అంజి' సినిమా.. విజువల్స్ పరంగా అదరగొట్టినా కూడా అనుకున్నంత రేంజులో ఆడలేదు. లేటైన సినిమాలు అంతే.. ఇంప్రెస్ చేయడానికి కష్టపడాల్సిందే. ఓ మూడేళ్ళ క్రితం బి.గోపాల్ దర్శకత్వంలో హీరో గోపిచంద్ కూడా ఒక సినిమా చేశాడు. అందులో నయనతార హీరోయిన్. అప్పుడప్పుడూ షూట్ చేసేసి ఈ సినిమాను మొత్తంగా పూర్తి చేశారట. ఇన్నాళ్ళూ ఈ సినిమాను రిలీజ్ చేసుకోలేకపోయినా నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం ''బలం'' అనే టైటిల్ తో వచ్చే డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే 'జిల్' దెబ్బతో కాస్త షేకైన గోపి.. ఈ సినిమాను తన ''ఆక్సిజన్'' విడుదలై హిట్టు కొట్టాక రిలీజ్ చేస్తే బెటర్ అని చెబుతున్నా.. నిర్మాతలు వినట్లేదు. అందుకే ఇప్పుడు గోపి తన బలమంతా వాడేసి ఈ రిలీజ్ ను పోస్టుపోన్ చేయించడానికి కష్టపడుతున్నాడని టాక్ వినిపిస్తోంది.

సర్లేండి.. హీరో ఇమేజ్ అనేదే ఇక్క కమర్షియల్ సినిమాలు ఆడటానికి ముఖ్యమైన వెపన్. అలాంటప్పుడు హీరో సపోర్టు లేకుండా ఆ నిర్మాతలు మాత్రం బలం చూపిస్తామంటే కుదరదులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/