Begin typing your search above and press return to search.
మరో స్టార్ హీరోయిన్ మూవీ ఓటిటి రిలీజ్ కానుందట!
By: Tupaki Desk | 30 July 2020 1:40 PM ISTలాక్ డౌన్ వలన ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విడుదలకు సిద్ధమైన సినిమాలు, షూటింగ్ ముగింపు దశలో ఉన్న సినిమాల పరిస్థితులు చెప్పక్కర్లేదు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడి వాటి ఊసే లేకుండా పోతున్నాయి. ఇదే మంచి తరుణం అని భావిస్తున్న డిజిటల్ థియేటర్లు, ఓటిటి ప్లాట్ ఫాములు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను కొనేస్తూ ఆన్ లైన్ విడుదల చేసేస్తున్నాయి. అందులో స్టార్ హీరోహీరోయిన్ల దగ్గర నుండి ప్రతీ ఒక్కరి సినిమాలు, వెబ్ సిరీస్లు ఇలా అన్నీ ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి.
ప్రస్తుతం సినిమా థియేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో ఏ దిక్కులేక ఆర్థిక ఇబ్బందుల వలన పలువురు నిర్మాతలు ఓటిటిలకు అమ్మేసుకుంటున్నారు. ఇటీవలే మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా పరిస్థితి కూడా అంతే అయింది. లాక్ డౌన్ వలన ఆలస్యం చేయకుండా నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసి విడుదల చేసాడు. అయితే ఆ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే పక్కా థియేటర్లో విడుదల చేద్దామనుకున్న మూవీ ఓటిటి రిలీజ్ అయింది. తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న మూవీ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుందట.
ప్రస్తుతం మిల్కీ బ్యూటీ గోపీచంద్ హీరోగా రూపొందుతున్న 'సీటిమార్' మూవీలో నటిస్తుంది. అయితే సీటిమార్ ప్రస్తుతం ముగింపు దశలో ఉందట. ఈ సినిమా కూడా ఓటిటిలో విడుదల అవబోతున్నట్లు సమాచారం. థియేటర్ల గురించి ఆలస్యం చేయకుండా ఏదైనా ఓటిటి ఈ సినిమా బడ్జెటుకు తగ్గ డీల్ మాట్లాడితే హ్యాపీగా ఓటిటిలో విడుదల చేసేయడానికి సిద్ధం అవుతున్నారని ఇండస్ట్రీ టాక్. అంతేగాక ఇప్పటికే పలు ఓటిటిలతో నిర్మాతల సంప్రదింపులు జరుగుతున్నాయట. మరి మొన్నటి కీర్తిసురేష్, ఇప్పుడేమో తమన్నా మూవీ ఓటిటి బాట పడుతుందని సినీవర్గాలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. మరి త్వరలోనే సీటిమార్ మూవీ విడుదల గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి!