Begin typing your search above and press return to search.

'ఈతరం' ను మళ్లీ ఓపెన్‌ చేస్తాడట

By:  Tupaki Desk   |   7 Sep 2021 10:30 AM GMT
ఈతరం ను మళ్లీ ఓపెన్‌ చేస్తాడట
X
హీరోగా ఎంట్రీ ఇచ్చి నిరాశ పర్చి.. ఆ తర్వాత విలన్ గా మారి సక్సెస్ దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించిన గోపీచంద్ మళ్లీ హీరోగా మారి సుదీర్ఘ కాలంగా కెరీర్‌ లో దూసుకు పోతున్నాడు. సక్సెస్‌ ప్లాప్‌ లతో సంబంధం లేకుండా గోపీచంద్‌ లక్కీగా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన సిటీమార్ సినిమాతో గోపీచంద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమాకు సంపత్‌ నంది దర్శకత్వం వహించాడు. తమన్నా హీరోయిన్ గా నటించిన సీటీమార్‌ విడుదల సందర్బంగా గోపీచంద్‌ వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో తన తండ్రి నిర్వహించిన ఈతరం ఫిల్మ్స్ ను పునః ప్రారంభించే యోచనలో ఉన్నట్లుగా కూడా గోపీచంద్‌ పేర్కొన్నాడు.

ఈతరం ఫిల్మ్స్ బ్యానర్ లో టి కృష్ణ గారు పలు విభిన్న చిత్రాలను తెరకెక్కించారు. స్వీయ దర్శకత్వంలో ఈతరం బ్యానర్‌ లో టి కృష్ణ నిర్మించిన సినిమాలు ఎప్పటికి నిలిచి పోయే సినిమాలుగా మిగిలాయి. అంతటి భారీ విజయాలను దక్కించుకున్న ఈతరం బ్యానర్‌ టి కృష్ణ గారు మృతి చెందడంతో కనుమరుగయ్యింది. గోపీచంద్‌ హీరోగా బిజీగా ఉన్న నేపథ్యంలో మళ్లీ ఈతరం బ్యానర్‌ లో సినిమాలు వస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో గోపీచంద్‌ భవిష్యత్తులో ఈతరం ను పునః ప్రారంభిస్తాను అంటూ ప్రకటించిన నేపథ్యంలో టి కృష్ణ సినిమాలను ఇష్టపడే వారు ఇండస్ట్రీలో ఉన్న ఆయన సన్నిహితులు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

సిటీమార్ సినిమాలో కబడ్డీ కోచ్‌ గా గోపీచంద్‌ కనిపించబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ మరియు ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. సంపత్‌ నంది చాలా నమ్మకంతో ఈ సినిమా ను ఈ సమయంలో విడుదల కు సిద్దం చేశారు. తమన్నా కు మరియు గోపీచంద్ కు ఈ సినిమా సక్సెస్‌ ఈ సమయంలో చాలా అవసరం.

ఇక సంపత్‌ నందికి సిటీమార్ విజయం కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని అంటున్నారు. ఇంతగా హోప్స్ ఉన్న సీటీమార్ సినిమా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్‌ హీరోగా మరికొంత కాలం వరుస సినిమాలు చేస్తూ సక్సెస్‌ లు దక్కించుకుని తన తండ్రి దారిలో ఈతరం ఫిల్మ్స్ ను పునః ప్రారంభించి సక్సెస్‌ ఫుల్‌ గా సినిమాలను నిర్మించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాబోయే కాలంలో ఈతరం సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.