Begin typing your search above and press return to search.

గోపీచంద్ ఫ్యామిలీ గ్రహపూజ

By:  Tupaki Desk   |   25 Feb 2016 11:00 PM IST
గోపీచంద్ ఫ్యామిలీ గ్రహపూజ
X
హీరో గోపీచంద్ ఇప్పుడు పుణ్యక్షేత్రాల టూర్ లో ఉన్నాడు. భార్య, కొడుకుతో కలిసి దేవాలయాలను దర్శించుకునే పనిలో ఉన్నాడు. శ్రీకాళహస్తి వచ్చినపుడు.. కుటుంబంతో కలిసి నవగ్రహ పూజ చేశాడీ హీరో. ప్రత్యేకించి రాహుకేతు పూజ చేసినట్లు పూజారులు చెబుతున్నారు. తన చిన్నారి కొడుకు తలనీలాలు దేవుడికి సమర్పించిన తర్వాత కొడుకుతో కలిసి రాహుకేతు పూజ చేశారు గోపీచంద్-రేష్మ జంట.

తన టూర్ ఎంతో సంతోషంగా సాగుతోందని, ఫ్యామిలీతో కలిసి ఇలా దైవదర్శనానికి రావడం ఆనందంగా ఉందని చెప్పాడీ హీరో. గతేడాది గోపీచంద్ కి అస్సలు కలిసి రాలేదు. 2014 లౌక్యంతో హిట్ కొట్టిన తర్వాత.. గతేడాదిలో జిల్, సౌఖ్యం రెండూ ఫ్లాప్స్ గా మిగిలాయి. దీంతో ఇప్పుడు గోపీచంద్ కి అర్జంటుగా ఓ హిట్ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆక్సిజన్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గోపీచంద్ కి జంటగా రాశి ఖన్నా నటించగా... జగపతిబాబు - కిక్ శ్యామ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఆక్సిజన్ తో పాటు మూడేళ్ల క్రితం మొదలైన మరో మూవీ కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ - నయనతార జంటగా నటించిన మూవీ.. అన్ని కష్టాలను అధిగమించి విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం