Begin typing your search above and press return to search.

యాక్షన్ హీరో వైవాహిక జీవితానికి పది వసంతాలు

By:  Tupaki Desk   |   13 May 2023 6:56 PM IST
యాక్షన్ హీరో వైవాహిక జీవితానికి పది వసంతాలు
X
యాక్షన్ హీరో గోపీచంద్‌ సక్సెస్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కెరీర్‌ ని హీరో పాత్రలతో ఆరంభించి మధ్య లో విలన్‌ వేషాలు వేసిన గోపీచంద్‌ మళ్లీ హీరోగా నటించి మెప్పించి వరుసగా హీరోగానే సినిమాలు చేస్తున్న గోపీచంద్‌ తాజాగా రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందో లేదో అప్పుడే మరో సినిమాతో బిజీ అయిన గోపీచంద్‌ తాజాగా తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్యారిస్‌ లో భార్య రేష్మ తో కలిసి సందడి చేశాడు.

ప్యారిస్ లోని ఈఫిల్‌ టవర్ వద్ద తమ పది వసంతాల వివాహ వార్షికోత్సవం ను జరుపుకున్నాడు.

శ్రీకాంత్‌ మేనకోడలు అయిన రేష్మ అమెరికాలో చదువుకుంటున్న సమయంలో గోపీచంద్‌ చూసి ఇష్టపడి పెళ్లికి సిద్ధం అయ్యాడు. గోపీచంద్‌ - రేష్మ దంపతులకు ఇద్దరు సంతానం. మొదటి బాబు పేరు విరాట్‌ కృష్ణ.. రెండవ బాబు పేరు వియాన్‌ కృష్ణ.

హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఉన్నా కూడా గోపీచంద్‌ సాధ్యం అయినంత ఎక్కువ సమయంకు ఫ్యామిలీకి కేటాయించడం జరుగుతుంది. తాజాగా పదవ వార్షికోత్సవం సందర్భంగా ప్యారిస్ లో భార్య మరియు పిల్లలతో హాలీడేస్ ను ఎంజాయ్‌ చేయడం జరిగింది.