Begin typing your search above and press return to search.

గోపీచంద్ బర్త్ డే స్పెషల్: 'పక్కా కమర్షియల్' సర్‌ప్రైజింగ్ పోస్టర్..!

By:  Tupaki Desk   |   11 Jun 2021 12:37 PM GMT
గోపీచంద్ బర్త్ డే స్పెషల్: పక్కా కమర్షియల్ సర్‌ప్రైజింగ్ పోస్టర్..!
X
యాక్షన్ హీరో గోపీచంద్ - ఎంటర్టైనింగ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. కమర్షియల్ పంథాలో సాగే కామెడీ ఎంటర్‌టైనర్ గా మారుతి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో గోపీచంద్ లాయర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఓ సీరియల్ స్టార్ గా కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

రేపు (జూన్ 12) హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్ర బృందం ఓ సర్‌ప్రైజింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో కళ్ళద్దాలు పెట్టుకొని గోపీచంద్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇది ఓ సాంగ్ లోని స్టిల్ అని అర్థం అవుతోంది. ఇప్పటి వరకు మాస్ గెటప్స్ తో అలరించిన మ్యాచో స్టార్ గోపీచంద్.. ఈసారి 'పక్కా కమర్షియల్' లో సరికొత్త లుక్ లో మెప్పించడానికి రెడీ అవుతున్నారు.

'పక్కా కమర్షియల్' సినిమా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 బ్యానర్లపై రూపొందుతోంది. బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్ సంగీతం సమకూరుస్తుండగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంతకముందు అక్టోబర్‌ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కానీ కరోనా పరిస్థితులను బట్టి సినిమా రిలీజ్ ఉంటుంది. 'ప్రతీరోజూ పండగే' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మారుతి.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు 'పక్కా కమర్షియల్' హిట్ అందిస్తాడేమో చూడాలి.