Begin typing your search above and press return to search.

స్పోర్ట్స్ కథతో వస్తున్న ఫ్లాప్ కాంబినేషన్

By:  Tupaki Desk   |   21 Sep 2019 4:51 AM GMT
స్పోర్ట్స్ కథతో వస్తున్న ఫ్లాప్ కాంబినేషన్
X
టాలీవుడ్ లో సహజంగా ఫ్లాప్ కాంబినేషన్లు మళ్లీ రిపీట్ అవ్వవు. ఆ కాంబినేషన్ పై నిర్మాతలు డబ్బులు పెట్టడానికి కూడా భయపడతారు. కానీ ఇప్పుడు ఓ ఫ్లాప్ కాంబినేషన్ లో మళ్లీ ఓ సినిమా రాబోతుంది. అదే గోపిచంద్ - సంపత్ నంది కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో ఆ మధ్య 'గౌతమ్ నంద' వచ్చింది. ఓ మాస్ కమర్షియల్ కథతో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గోపిచంద్ మార్కెట్ ని పట్టించుకోకుండా బడ్జెట్ పెట్టడంతో నిర్మాతలు బాగా నష్టపోయారు.

అయితే గోపిచంద్- సంపత్ నంది ఇప్పుడు ఓ స్పోర్ట్స్ డ్రామాతో రానున్నారట. ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నాడట. సినిమా కథ కూడా కబడ్డీ చుట్టూనే ఉంటుందట. కథతో పాటు క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండటం వల్లే గోపిచంద్ మళ్లీ సంపత్ కి ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. లేటెస్ట్ గా స్క్రిప్ట్ ను లాక్ చేసుకొని అనౌన్స్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుంది. హీరోయిన్ తో పాటు మిగతా కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు సంపత్ నంది.

ప్రస్తుతం చాణక్య ని రిలీజ్ కి రెడీ చేసిన గోపిచంద్ బిను సుబ్రహ్మణ్యం అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత సంపత్ నందితో సినిమా మొదలు పెడతాడని సమాచారం. మరి ఈ ఫ్లాప్ కాంబో ఈసారైనా విజయం అందుకొని హిట్ కాంబో అనిపించుకుంటుందేమో చూడాలి.