Begin typing your search above and press return to search.

చైతు- మారుతి కోసం గోపి సంగీతం

By:  Tupaki Desk   |   8 Jan 2018 1:56 PM GMT
చైతు- మారుతి కోసం గోపి సంగీతం
X
అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రస్తుతం సవ్యసాచి మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని సమ్మర్ నాటికి విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉండగా.. ఇప్పటికే తన మరుసటి చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టేశాడు కొత్త పెళ్లి కొడుకు చైతు.

మహానుభావుడు మూవీతో రీసెంట్ గా సూపర్ హిట్ అందుకున్న మారుతి దర్శకత్వంలో.. తన తర్వాతి మూవీ చేయనున్నాడు చెయ్. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తన స్టైల్ స్వరాలతో అలరిస్తున్న గోపీసుందర్ ను ఖాయం చేశారని అంటున్నారు. గతంలో మారుతితో కలిసి భలేభలే మగాడివోయ్ మూవీకి వర్క్ చేసిన ఈ కంపోజర్.. మారుతి నుంచి మరోసారి పిలుపు రాగానే వెంటనే అంగీకరించాడట.

చైతు-మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో.. లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ అను ఇమాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. హీరోయిన్ పై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేయాల్సి ఉంది. తన ప్రతీ కథలోను ఓ ప్రాబ్లెం ఇరికిస్తున్న దర్శకుడు మారుతి.. చైతుతో చేయబోయే మూవీలో ఇగో ప్రాబ్లెమ్స్ ను చూపనున్నాడట. ఈ సారి హీరో-హీరోయిన్స్ ఇద్దరికీ ఇగో ఉంటుందని.. ఆ కారణంగా ఆ జంట మధ్య వచ్చిన సమస్యలను ఫన్నీగా డీల్ చేస్తాడని తెలుస్తోంది.