Begin typing your search above and press return to search.

అల్లుడిగారి పాట‌లు ఆక‌ట్టుకుంటాయా?

By:  Tupaki Desk   |   20 Aug 2018 12:10 PM GMT
అల్లుడిగారి పాట‌లు ఆక‌ట్టుకుంటాయా?
X
ఈ మ‌ధ్య కాలంలో చిన్న సినిమాల‌కు అద్భుత‌మైన సంగీతాన్నిస్తున్న సంగీత ద‌ర్శ‌కుడు గోపీ సుంద‌ర్. తాజాగా `ఇంకేం ఇంకేం కావాలే....`అంటూ యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్ కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడీ మ‌ల‌యాళీ మ్యుజీషియ‌న్. హీరోగా మార‌బోతోన్న ఈ సంగీత ద‌ర్శ‌కుడి తాజా చిత్రం` గీత గోవిందం` మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దీంతో, గోపీ సుంద‌ర్ తర్వాతి చిత్రం`శైల‌జా రెడ్డి అల్లుడు`పై కూడా ప్రేక్ష‌కులు - అక్కినేని అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. అయితే, ఇప్ప‌టికే ఆ చిత్రంలో విడుద‌లైన రెండు పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేద‌ని టాక్ ఉంది. ఈ రోజు తాజాగా విడుద‌లైన `ఎగిరెగిరే` అనే పాట ఓ మోస్త‌రుగా ఉంది. దీంతో, ఈ రోజు విడుద‌ల కాబోతోన్న ఆడియో ఎలా ఉండ‌బోతోందోన‌ని అక్కినేని అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు.

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ తో తెరంగేట్రం చేసిన గోపీ సుంద‌ర్ ‘మజ్ను’.. ‘భలే భలే మగాడివోయ్’.. ‘ఊపిరి’ - ‘నిన్ను కోరి’ చిత్రాల‌కు మంచి సంగీతాన్నిచ్చాడు. అయితే, ‘రాజు గాడు’.. ‘జంబలకిడి పంబ’.. ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమాల సంగీతంతో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ ర‌కంగా మిక్స్ డ్ రిజ‌ల్ట్స్ ఇస్తోన్న గోపీ....`గీత గోవిందం`తో ట్రాక్ లో ప‌డ్డాడ‌ని అంతా అనుకున్నారు. అయితే, నాగచైతన్య-అను ఇమ్మాన్యుయేల్ ల కాంబోలో మారుతి తెరకెక్కిస్తోన్న‌ ‘శైలజా రెడ్డి అల్లుడు’ పాట‌లు అంత‌గా ఆక‌ట్టుకోలేద‌ని టాక్ వ‌స్తోంది. మొద‌ట రిలీజైన‌ ‘అను బేబీ’ పాట అంత‌గా ఆకట్టుకోలేదని - `శైలజారెడ్డి అల్లుడూ`.. అంటూ మంగ్లీ పాడిన కూడా యావరేజ్ అని టాక్ వ‌చ్చింది. ఇక తాజాగా లాంచ్ అయిన‌ `ఎగిరెగిరే` అనే పాట కూడా ఓ మోస్త‌రుగా ఉందని టాక్. అయితే, సిద్ పాడిన ఆ పాట `ఇంకేం ఇంకేం కావాలే` రేంజ్ లో లేదు. దీంతో, సోమవారం విడుద‌ల కాబోతోన్న‌‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫుల్ ఆడియో ఎలా ఉండ‌బోతోంద‌న‌న్న క‌ల‌వరం అక్కినేని ఫ్యాన్స్ లో మొద‌లైంది.