Begin typing your search above and press return to search.

గోపీ సుందర్.. సూపర్ ఫాస్ట్ గురూ

By:  Tupaki Desk   |   27 March 2016 5:30 PM GMT
గోపీ సుందర్.. సూపర్ ఫాస్ట్ గురూ
X
నాగార్జున - కార్తిలు నటించన ఊపిరి రిలీజ్ తర్వాత సంగీత దర్శకుడు గోపీ సుందర్ హాట్ టాపిక్ అయిపోయాడు. ఈ మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రం చేశాడు. గతేడాది వచ్చిన భలేభలే మగాడివోయ్ కూడా గోపీ సుందర్ అకౌంట్ లోదే. కానీ ఊపిరి మాత్రం.. ఈ కంపోజర్ కి ఫస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ. అంతే కాదు.. ఈయన సంగీతం అందించిన వాటిలో తెలుగు - తమిళ్ రెండు భాషల్లోనూ రూపొందిన మొదటి సినిమా కూడా ఇదే.

మొదట వంశీ పైడిపల్లి ఊపిరి స్టోరీని చెప్పి.. మ్యూజిక్ ఇమ్మని అడగ్గా.. గంట టైంలోనే ఫస్ట్ సాంగ్ కంపోజ్ ఇచ్చాడట గోపీ. ఆ తర్వాత ఐదే రోజుల్లో మరో 3 పాటలకు కూడా ట్యూన్స్ కట్టేశాడట. తను సహజంగానే చాలా ఫాస్ట్ గా మ్యూజిక్ కంప్లీట్ చేస్తూ ఉంటానని చెప్పిన గోపీ సుందర్.. తను మరీ ఇంత ఫాస్ట్ అనుకోలేదని, డైరెక్టర్ వంశీ పైడిపల్లి అన్నాడని చెప్పాడు. అంతే కాదు.. కొంచెం స్పీడ్ తగ్గించుకోమని సలహా కూడా ఇచ్చాడట.


ఊపిరి చిత్రం మొత్తంలో ఊపిరి బిగపట్టి చూసేలా ఉంటుంది ఆ మూవీ మ్యూజిక్. ఇదంతా ఫినిష్ చేయడానికి.. గోపీ సుందర్ కి పట్టిన 20 రోజులు మాత్రమేనట. అసలు ఇది కూడా తనకు ఎక్కువే అంటున్నాడీయన. మలయాళంలో భారీ బడ్జెట్ సినిమాకు మ్యూజిక్ కోసం వెచ్చించే మొత్తం 15-20లక్షల్లోపే ఉంటుందని.. ఇక్కడ భారీ బడ్జెట్ మూవీ కావడంతో కొన్ని ప్రయోగాలు చేయడంతోనే కొంచెం ఎక్కువ టైం పట్టిందని చెప్పాడు గోపీ సుందర్. వావ్.. ఈయన మరీ ఫాస్ట్ కదూ.