Begin typing your search above and press return to search.

డాడీ డే స్పెష‌ల్.. గోపీచంద్ వార‌సుల్ని చూశారా?

By:  Tupaki Desk   |   21 Jun 2020 11:20 AM IST
డాడీ డే స్పెష‌ల్.. గోపీచంద్ వార‌సుల్ని చూశారా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. వార‌సుల‌కు సోష‌ల్ మీడియాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. న‌మ్ర‌త మ‌హేష్ రెగ్యుల‌ర్ గా గౌత‌మ్ - సితార యాక్టివిటీస్ ని సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్స్ కి షేర్ చేస్తుంటారు. బేబి సితారకు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో భారీగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. మంచు విష్ణు.. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌.. అల్ల‌రి న‌రేష్ లాంటి వాళ్లు సోష‌ల్ మీడియాల్లో వార‌సుల ఫోటోల్ని విరివిగానే షేర్ చేస్తుంటారు.

అయితే ర‌వితేజ‌.. గోపిచంద్ లాంటి స్టార్లు రేర్ గా మాత్ర‌మే ఫ్యామిలీకి సంబంధించిన విష‌యాల్ని సోష‌ల్ మీడియాల్లో రివీల్ చేస్తుంటారు. ఇటీవ‌ల ర‌వితేజ ఫ్యామిలీ ఫోటోలు రివీల‌య్యాయి. ర‌వితేజ వార‌సుల ఫోటోల్ని అభిమాన‌ నెటిజ‌నులు విశేషంగానే షేర్ చేశారు. తాజాగా అదే బాట‌లో గోపీచంద్ కూడా త‌న వార‌సుల్ని ప‌రిచ‌యం చేశారిలా. ఫాద‌ర్స్ డేని గోపీ స్పెష‌ల్ గానే ప్లాన్ చేశారు.

``ఒక తండ్రిగా అత్యుత్త‌మ భావ‌న‌తో ఉన్నాను. మా పిల్ల‌ల్ని చూస్తుంటే దేవుని ఆశీస్సుల‌తో సంపూర్ణ‌త సాధించిన‌ట్టే అనిపిస్తోంది. మై ల‌వ్ లీ లిటిల్ వ‌న్స్.. నాకు బ‌లంగా నిలిచినందుకు థాంక్యూ`` అంటూ కాస్త ఎమోష‌న‌ల్ గానే ట్వీట్ చేశారు గోపీచంద్. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాల్లో గోపీచంద్ వార‌సుల ఫోటోలు వైర‌ల్ గా షేర్ అవుతున్నాయి. హ్యాపీ ఫాద‌ర్స్ డే విషెస్ తెలియ‌జేస్తూ.. గోపీచంద్ వార‌సుడు విరాట్ కృష్ణ‌ని ఆయ‌న తండ్రి గారైన టి.కృష్ణ గారితో పోల్చిన అభిమాని అత‌డి రెండో వార‌సుడు వియాన్ ని ప్రేమ్ చంద్ గారు అంటూ పోల్చ‌డం విశేషం.