Begin typing your search above and press return to search.

గోపీచంద్ ‘ఆక్సిజన్’ పూర్తి!

By:  Tupaki Desk   |   2 Feb 2017 1:15 PM GMT
గోపీచంద్ ‘ఆక్సిజన్’ పూర్తి!
X
ఎందుకో గోపీచంద్ సినిమాలు బాగా లేట్. నిర్మాతల ప్రాబ్లమో లేక దర్శకుల సమస్య అనేది తెలియదు కానీ.. గోపీచంద్ సినిమాలు ఎంత తొందరగా సెట్స్ మీదకు వెళతాయో... అంత లేట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాయి. తాజాగా గోపీచంద్ నటిస్తున్న ‘ఆక్సిజన్’ సినిమా కూడా కొంత ఆలస్యమైనా.. షూటింగ్ మాత్రం కంప్లీట్ అయింది. రాశీఖన్నా... మజ్ను ఫేం అను ఎమ్మాన్యుయెల్ గోచంద్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. షూటింగ్ కంప్లీట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంవంతం చేసిందట చిత్ర బృందం.

ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోగా.. అతి త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో జగపతిబాబు... కిక్ శ్యామ్... అలీ.. తాగుబోతు రమేష్.. చంద్రమోహన్ తదితరులు నటిస్తున్నారు. గతంలో గోపీచంద్ సినిమాల్లో యాక్షన్ తో పాటు.. ఎంటర్టైన్ మెంట్ ఎలా వుంటుందో... ఇందులో కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా వుంటుందని చిత్రబృందం చెబుతోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ..‘ముంబై.. గోవా.. సిక్కిం.. చెన్నై తదితర ప్రదేశాల్లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందించాం. యువన్ శంకర్ రాజా చక్కటి సంగీతం అందించారు. అతని పాటలు తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ విషయం సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. త్వరలోనే ఆడియోను విడుదల చేసి.. అనంతరం సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం" అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/