Begin typing your search above and press return to search.
ఆక్సిజన్ కు విముక్తి లభిస్తోంది
By: Tupaki Desk | 14 April 2017 1:06 PM GMTహీరో గోపిచంద్ మరోసారి ఆ ఒక్క హిట్టు కావాలి అంటూ వెయిటింగ్ చేస్తున్నాడు. వరుసగా ఫ్లాపులు వస్తున్న వేళ.. రొటీన్ గా ఉన్న లౌక్యం సినిమా కారణంగా బ్రేక్ వచ్చిందనే అనుకుంటే.. ఆ తరువాత మళ్లీ ఫ్లాపులే వెంటబడ్తున్నాయ్. అందుకే ఇప్పుడు సంపత్ నంది డైరక్షన్లో వస్తున్న ''గౌతమ్ నంద'' సినిమాపై చాలా ఆశలనే పెట్టుకున్నాడు. కాని అంతకంటే ముందు మరోసినిమా ఉందండోయ్.
ఏ.ఎం.రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ.. అప్పట్లో కొన్ని సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన డైరక్షన్ పాటవాలను టెస్టింగ్ చేసుకోవడానికి ''ఆక్సిజన్'' అంటూ గోపిచంద్ హీరోగా ఒక సినిమాను మొదలెట్టేశాడు. జిల్ సినిమా కాంబో రిపీట్ చేయాలని రాశి ఖన్నాను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే అనివార్య కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. గోపి కూడా తదుపరి సినిమా వైపు దూసుకెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తియపోయినట్లు పేర్కన్నారు నిర్మాతలు.
మొత్తానికి ఆక్సిజన్ మానవాళికి విముక్తిని ఇస్తుంటే.. ఈ ఆక్సిజన్ కు మాత్రం గోపిచంద్ విముక్తిని ప్రసాదించాడు. అది ఏ రేంజులో అంటే.. ఏకంగా మే నెలలో సినిమా రిలీజ్ అని కూడా చెప్పేశారు. ఏప్రియల్ 28న బాహుబలి వచ్చాక.. మే నెలలో ఆక్సిజన్ ఏ డేటున తేవాలనే విషయంపై క్లారిటీ ఇస్తారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/