Begin typing your search above and press return to search.

పక్కా కమర్షియల్‌ కు గుమ్మడికాయ..!

By:  Tupaki Desk   |   10 Jun 2022 7:45 AM GMT
పక్కా కమర్షియల్‌ కు గుమ్మడికాయ..!
X
గోపీచంద్‌ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మిస్తున్న పక్కా కమర్షియల్‌ విడుదల తేదీ ప్రకటించి ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. ఇటీవలే సినిమా నుండి పాట విడుదల అయ్యింది. వరుసగా సినిమాకు సంబంధించిన ప్రమోషనల్‌ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇదే సమయంలో సినిమా షూటింగ్‌ ఇంకా జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

సినిమాను జులై 1వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించి ఇంకా షూటింగ్‌ చేస్తున్నారేంటి అంటూ దర్శకుడు మారుతిని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్క్‌ వారు ప్రశ్నించారట. సినిమా ఎట్టకేలకు పూర్తి అయ్యింది. కాస్త ఆలస్యం అయినా కూడా ఔట్ పుట్‌ నిజంగా పక్కా కమర్షియల్‌ అనిపించేలా వచ్చినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

తాజాగా సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వడంతో గుమ్మడి కాయ కొట్టేశారు. ఇదే సమయంలో షూటింగ్‌ పూర్తి అయిన సందర్బంగా కేక్ ను కట్ చేసి సెలబ్రేట్‌ చేయడం జరిగింది. షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక పూర్తి దృష్టి సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ పై పెట్టబోతున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. కనుక సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చేప్పటికి అన్ని పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది.

మారుతి దర్శకత్వంలో ఒక పక్కా కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. గోపీచంద్‌ కు ఈ సినిమా చాలా కీలకం.

ఆయన కెరీర్‌ లో వరుసగా ప్లాప్‌ లు చవిచూస్తూ వస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే గోపీచంద్‌ మరికొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతాడు అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

పక్కా కమర్షియల్‌ తర్వాత ప్రభాస్ తో రాజా డీలక్స్ అనే సినిమాను మారుతి చేయాల్సి ఉంది. ఈ సినిమా హిట్‌ అయితే ఏమాత్రం ఆలోచన లేకుండా ప్రభాస్ నుండి మారుతికి పిలుపు వచ్చే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా పక్కా కమర్షియల్‌ సినిమా హిట్‌ అవ్వాలనే పట్టుదలతో మారుతి ఉండి ఉంటాడు. అందుకే ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాడు.