Begin typing your search above and press return to search.

10 ఏళ్ళ పాత కాంబో.. క్రిస్మ‌స్ రోజున

By:  Tupaki Desk   |   6 Sep 2015 5:22 AM GMT
10 ఏళ్ళ పాత కాంబో.. క్రిస్మ‌స్ రోజున
X
మాస్, యాక్ష‌న్ స్టో్రీస్ తెర‌కెక్కించ‌డంలో ఏ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రికి ఓ ప్ర‌త్యేక శైలి ఉంది. అప్ప‌ట్లో అగ్రెస్సివ్ హీరో గోపిచంద్‌ తో య‌జ్ఞం తీసి హిట్ కొట్టాడు. అయితే ఆ సినిమా తెర‌కెక్కి ఇప్ప‌టికి 10ఏళ్లు పూర్త‌యినా ఈ కాంబో లో సినిమా మ‌ళ్లీ రానేలేదు. ఇన్నాళ్టికి ఈ ఇద్ద‌రూ క‌లిశారు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై ఓ ఫ్యామిలీ యాక్ష‌న్‌ ఎంట‌ర్‌ టైన‌ర్‌ ని త‌యారు చేస్తున్నారు. 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

ఇదో డిఫ‌రెంట్ పాయింట్‌ తో తెర‌కెక్కుతున్న సినిమా. స్ర్రీన్‌ ప్లే లో సంథింగ్ ఉంటుంద‌ని ర‌వికుమార్ చౌద‌రి చెబుతున్నాడు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న ఈ చిత్రం రిలీజ‌వుతుంది. గోపీచంద్ సినిమా అంటే యాక్ష‌న్ త‌ప్ప‌నిస‌రి. కాబ‌ట్టి యాక్ష‌న్‌లోనే ఇంకేదైనా కొత్త గా ఎటెంప్ట్ చేస్తున్నాడా? అంటే అదేమీ క‌నిపించ‌డం లేదు. గోపిచంద్ లుక్ ప‌రంగా పెద్ద‌గా మార్పులు చేస్తున్న‌ది లేదు. అయితే ఈ సినిమాలో డిఫ‌రెంట్ ఏం చూపిస్తాడో చూడాల‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది.

ఇప్ప‌టికే సాయిధ‌ర‌మ్ తేజ్‌ కి పిల్లా నువ్వు లేని జీవితం వంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌ ని ఇచ్చాడు. ఆ సినిమాని ఎంతో క్లారిటీతో తెర‌కెక్కించాడు చౌద‌రి. కాబ‌ట్టి ఇప్పుడు మ‌రోసారి అలాంటి మ్యాజిక్ ఏదైనా చేస్తాడేమో అన్న ఆశ ఉంది. గోపీ చంద్ కెరీర్‌ లోనే భారీ తారాగ‌ణం ఉన్న సినిమా ఇది. గోపీకి పెద్ద బ్రేక్ వ‌స్తుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చెబుతున్నారు. డిసెంబ‌ర్‌ లో రిలీజ్ అంటే అప్ప‌టికి పోటీ బ‌రిలో ఏదీ లేదు. స‌రైన ప్లానింగే.