Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ హిట్ అయితే ఆ సినిమాలు రీమేక్‌ ఎంట్రా బాబు?

By:  Tupaki Desk   |   21 July 2022 3:30 PM GMT
కేజీఎఫ్‌ హిట్ అయితే ఆ సినిమాలు రీమేక్‌ ఎంట్రా బాబు?
X
కన్నడ స్టార్‌ యశ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులకు చేరువ అయ్యాడు. హీరోగా యశ్‌ చేసిన కేజీఎఫ్ ఆయన్ను ప్రపంచానికి పరిచయం చేసింది.

అంతకు ముందు వరకు కన్నడం వరకే పరిచయం అయిన స్టార్‌ డమ్‌ ఇప్పుడు ఎల్లలు దాటింది. హీరో గా ఆయన తదుపరి సినిమా లు ఎప్పుడు ఎప్పుడు వస్తాయా అంటూ ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో ఆయన పాత సినిమా లను రీమేక్ చేయడం లేదా డబ్బింగ్‌ చేసేందుకు ఫిల్మ్‌ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కేజీఎఫ్ వచ్చిన తర్వాత ఇప్పటికే యశ్‌ నటించిన పాత సినిమాలు కొన్ని డబ్బింగ్‌ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఆయన దాదాపు పదేళ్ల క్రితం నటించిన గూగ్లీ అనే సినిమా ను రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కేజీఎఫ్‌ సినిమా సూపర్ హిట్‌ అవ్వడం వల్లే గూగ్లీ సినిమా ను రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. హిందీ ప్రముఖ ఫిల్మ్‌ మేకర్ మహేష్‌ దనన్నవార్‌ గూగ్లీ రీమేక్ కు ఏర్పాట్లు చేస్తున్నాడు. కేవలం హిందీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా రీమేక్ ను చేసి వదలాలని భావిస్తున్నారు. గూగ్లీ ని డబ్‌ చేసి విడుదల చేస్తే కేజీఎఫ్ స్టార్‌ యశ్‌ ఉన్నాడని జనాలు కొద్దో గొప్పో చూస్తారు.

కానీ సినిమాను రీమేక్ చేస్తే జనాల్లోకి ఎలా తీసుకు వెళ్తారో అర్థం కావడం లేదు. ఇప్పటి కేజీఎఫ్‌ పేరు చెప్పి ఎప్పుడో విడుదల అయిన సినిమా ను ఇప్పుడు రీమేక్ చేసి యశ్‌ పేరు చెప్పి విడుదల చేయాలి అనుకోవడం అవివేకం అంటూ సినీ జనాల్లో కొందరు మరియు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

గూగ్లీ సినిమా అప్పట్లో యావరేజ్ గానే నిలిచింది. ఆ సినిమాను రీమేక్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం అనేది చాలా మంది అభిప్రాయం. అయినా కేజీఎఫ్‌ హిట్ అయితే యశ్‌ సినిమా లు డబ్‌ చేసి విడుదల చేయాలి కాని రీమేక్‌ అది కూడా పాత సినిమా రీమేక్ ఏంట్రా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రీమేక్ నిర్ణయం ఖచ్చితంగా గూగ్లీ అవుతుందని అంటున్నారు.