Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ లో ఆగని గూఢచారి హంగామా
By: Tupaki Desk | 12 Aug 2018 4:12 PM ISTశశికిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన 'గూఢచారి' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల ఆదరణతో పాటు, సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా దుమ్ము లేపుతోంది. రెండో వారంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా సినిమా ఇంకా మంచి కలెక్షన్స్ తో కొనసాగడం విశేషం.
మాడరన్ ఏజ్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన 'గూఢచారి' ఓవర్సీస్ లో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో 'గూఢచారి' దూకుడుకు రెండో వారంలో కూడా అడ్డే లేకుండా పోయింది. ఓవర్ సీస్ ప్రేక్షకులు సహజంగానే కొత్తదనానికి పట్టంకట్టడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. దాంతో ఈ సినిమాకు అక్కడ మంచి ఆదరణే దక్కుతోంది.
'గూఢచారి' ఇప్పటికే మంచి కలెక్షన్స్ తో డొమెస్టిక్ మార్కెట్ లో ప్రాఫిట్ జోన్ లోకి రావడం విశేషం. ఈ సినిమా విజయంతో తెలుగులో మరిన్ని స్పై థ్రిల్లర్ జోనర్లో మరి కొన్ని సినిమాలు తెరకెక్కుతాయనే అంచనాలు ఉన్నాయి.