Begin typing your search above and press return to search.
సలార్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ నిజమేనా?
By: Tupaki Desk | 22 Jan 2023 6:00 PM ISTబాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన సాహో, రాదే శ్యాం సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. అయినా సరే ప్రభాస్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పెద్ద ఎత్తున బడా ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ వెళ్లారు. అయితే ప్రస్తుతం లైన్లో ఉన్న అన్ని ప్రాజెక్టుల కంటే ప్రభాస్ ప్రశాంత్ రియల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్ సినిమా మీద అటు అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
యశ్ లాంటి ఎవరికీ పరిచయం లేని హీరోని ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మార్చేసిన ప్రశాంత్.. ఇప్పటికే పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్ ను ఇంకా ఎలా చూపించబోతున్నాడు అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సమాచారం మేరకు ఈ సలార్ సినిమా షూటింగ్ ఫిబ్రవరితో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80% పూర్తికాగా మిగతా 20% షూటింగ్ కూడా ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ మీద తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఫిబ్రవరితో పూర్తవుతూ ఉండడంతో మార్చి నెల నుంచి సినిమా ప్రమోషన్స్ ప్రారంభమై అవకాశం ఉందని ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడమే గాక భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండడంతో పోస్టు ప్రొడక్షన్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండు మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదని మరికొందరు అంటున్నారు. అయితే టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు ప్రశాంత్ నిల్ సినిమాతో సమాంతరంగా పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేయించుకుంటూ వస్తున్నారని సినిమా షూటింగ్ పూర్తయిన నెల రోజుల్లోపు ప్రమోషన్స్ ప్రారంభించి వీలైనంత త్వరగా సినిమాను తీసుకొచ్చేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. చూడాలి సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందనేది.