Begin typing your search above and press return to search.

‘కేజీఎఫ్’ లవర్స్ కు 21న గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   19 Dec 2020 12:30 PM GMT
‘కేజీఎఫ్’ లవర్స్ కు 21న గుడ్ న్యూస్
X
విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయం నమోదు చేసింది ‘కేజీఎఫ్‌ 1’. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ షూట్ కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసరాల్లో వేసిన ప్రత్యేక బంగారు గనుల సెట్లో జరుగుతోంది. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన గుడ్ న్యూస్ వెల్లడించబోతున్నట్టు దర్శకుడు ప్రకటించారు.

కన్నడ నటుడు యశ్, శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. దేశమంతా కేజీఎఫ్-2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో.. ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్టేడ్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్. అయితే.. ఇందులోనూ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ‘‘ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు. మీరంతా ఈ మూవీ కోసం ఎంతో ఓపికతో ఉన్నారు. మీ అందరికీ డిసెంబర్ 21, ఉదయం 10.08 గంటలకు మా చిత్ర యూనిట్ ఓ సర్ ఫ్రైజ్ ట్రీట్ ఇవ్వబోతోంది.’’ అని ప్రకటించాడు.

కేజీఎఫ్-2 చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం గతంలో జరిగింది. అయితే.. బిగ్ స్క్రీన్లోనే కేజీఎఫ్-2 విడుదలవుతుందని, ఓటీటీలో రిలీజ్ చేస్తామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చిత్ర హీరో యశ్ తేల్చి చెప్పారు. ఇప్పుడు దర్శకుడు ఇస్తామంటున్న ట్రీట్.. రిలీజ్ డేటే కావొచ్చనే చర్చ మూవీ ఫ్యాన్స్ లో జరుగుతోంది.