Begin typing your search above and press return to search.

'గుడ్ లక్ సఖి' రెడీ.. ఒకే నెలలో రెండు సినిమాలతో వస్తున్న మహానటి..!

By:  Tupaki Desk   |   1 Nov 2021 5:30 PM GMT
గుడ్ లక్ సఖి రెడీ.. ఒకే నెలలో రెండు సినిమాలతో వస్తున్న మహానటి..!
X
జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ''గుడ్ లక్ సఖి''. స్పోర్ట్స్‌ డ్రామా బ్యాక్ డ్రాప్ వస్తున్న ఈ సినిమాలో కీర్తి రైఫిల్‌ షూటర్‌ గా నటించింది. ఇందులో ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషించగా.. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో సఖిని విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు కీర్తి - ఆది పినిశెట్టి - జగపతిబాబు ఉన్న ఓ పోస్టర్‌ ని విడుదల చేసింది. ఈ సినిమాతో పాటుగా కీర్తి సురేష్ నటించిన 'పెద్దన్న' మూవీ కూడా నవంబర్ లోనే విడుదల అవుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఇందులో రజినీ సోదరిగా కీర్తి కనిపించనుంది. ఇలా మహానటి నటించిన రెండు సినిమాలు నవంబర్ లోనే సందడి చేయనున్నాయి.

కాగా, 'లక్ష్మి' 'ధనిక్' వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు నగేష్ కుకునూర్ ''గుడ్ లక్ సఖి'' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్‌ గా ఎలా మారిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజ్ సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రావ్యా వర్మ దీనికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'గుడ్ లక్ సఖి' ప్రచార చిత్రాలు - టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు ఎక్కువ మంది మ‌హిళలు వర్క్ చేయడం విశేషం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ''గుడ్ లక్ సఖి'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.