Begin typing your search above and press return to search.

'గుడ్ లక్ జెర్రీ' ట్రైలర్: అమాయకపు చూపులతో ఆకట్టుకున్న జాన్వీ..!

By:  Tupaki Desk   |   14 July 2022 11:39 AM GMT
గుడ్ లక్ జెర్రీ ట్రైలర్: అమాయకపు చూపులతో ఆకట్టుకున్న జాన్వీ..!
X
ఇటీవల కాలంలో బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదు. ఏవో ఒకటీ అర తప్ప ప్రేక్షకులను బాగా ఎగ్జైట్ చేసి థియేటర్లకు రప్పించిన సినిమాలు.. వారిని విపరీతంగా ఆకట్టుకున్న కంటెంట్ లేదనే చెప్పాలి. అందుకే సౌత్ లో సక్సెస్ అయిన చిత్రాలను హిందీలోకి రీమేక్ చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుడ్ లక్ జెర్రీ' అనే రీమేక్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షిస్తోంది

అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం "గుడ్ లక్ జెర్రీ". నెల్సన్ దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ హిట్ 'కోలమావు కోకిల' (తెలుగులో 'కో కో కోకిల') సినిమాకి ఇది అధికారిక రీమేక్. హిందీలో సిద్దార్థ్ సేన్ దర్శకత్వం వహించారు.

మాదక ద్రవ్యాల నేపథ్యంలో సీరియస్ కామెడీ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ గా'గుడ్ లక్ జెర్రీ' చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం గురువారం ట్రైలర్ ను ఆవిష్కరించారు.

కుటుంబ పోషణ మరియు తల్లి ఆరోగ్యం బాగుచేయించడం కోసం డ్రగ్స్ స్మగ్లింగ్ చేయాలని నిశ్చయించుకుంటుంది జాన్వీ కపూర్. పోలీసుల కళ్ళు గప్పి.. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మాదకద్రవ్యాలను సరఫరా చేస్తుంది. అలానే గుండాలను కూడా బురిడీ కొట్టించి పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొంగిలించి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది.

ఈ క్రమంలో జాన్వీ ఎలాంటి ఇబ్బందులు పడింది? డ్రగ్స్ మాఫియా మరియు పోలీసులకు తెలియకుండా డ్రగ్స్ ఎలా చేజిక్కించుకుంది? వంటి ఆసక్తికరమైన అంశాలతో 'గుడ్ లక్ జెర్రీ' సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. అమాయకపు చూపులతో జాన్వీ నటన ఆకట్టుకుంది. మొత్తం మీద ఈ ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

'గుడ్ లక్ జెర్రీ' చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ - లైకా ప్రొడక్షన్ సుభాకారన్ మరియు మహావీర్ జైన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 29న డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే పలు రీమేక్ చిత్రాల్లో నటించిన జాన్వీ కపూర్.. ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.