Begin typing your search above and press return to search.

గోల్డ్‌ సెట్‌... శంకర్‌ మూవీ అంటే అంతే మరి

By:  Tupaki Desk   |   8 Dec 2018 10:35 AM GMT
గోల్డ్‌ సెట్‌... శంకర్‌ మూవీ అంటే అంతే మరి
X
ఈ మద్య కాలంలో బాలీవుడ్‌ సినిమాల తో పోల్చితే సౌత్‌ సినిమా బడ్జెట్‌ అమాంతం పెరిగి పోయిందని ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. తమిళ దర్శకుడు శంకర్‌ మరియు తెలుగు దర్శకుడు రాజమౌళిలు తమ సినిమాల బడ్జెట్‌ ల విషయం లో వందల కోట్ల నుండి కాస్త కూడా తగ్గడం లేదు. ‘2.ఓ’ చిత్రాన్ని దాదాపుగా 550 కోట్లతో తెరకెక్కించిన శంకర్‌ ప్రస్తుతం ఇండియన్‌ 2 చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ లో ఉన్నాడు. కమల్‌ హాసన్‌ తో తెరకెక్కించబోతున్న సినిమా కూడా 200 కోట్లకు తగ్గకుండా బడ్జెట్‌ ఉంటుందని సమాచారం అందుతోంది.

శంకర్‌ దర్శకత్వంలో వచ్చే సినిమాల్లో సెట్స్‌ నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటాయి. పాటల కోసం కోట్లు పెట్టి సెట్స్‌ వేయించే ఘనత ఆయనకే సాద్యం. శంకర్‌ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా సెట్స్‌ కు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. తాజాగా ఇండియన్‌ 2 చిత్రం విషయంలో కూడా శంకర్‌ అదే పంథాను అవలంభించబోతున్నాడు. విశ్వసనీయం గా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్‌ 2 మూవీ కోసం శంకర్‌ ఏకంగా గోల్డ్‌ సెట్‌ వేయిస్తున్నాడట.

సినిమాకు సంబంధించిన కీలకమైన రెండు మూడు సినిమాల సీన్‌ ను ఆ గోల్డ్‌ సెట్‌ లో చిత్రీకరించనున్నారట. కీలక సన్నివేశాలకు సంబంధించిన సెట్‌ అవ్వడంతో రాజీ పడకుండా రెండు కోట్లు పెట్టి సెట్‌ ను వేయిస్తున్నాడు. నిజంగా గోల్డ్‌ లా అనిపించేలా సెట్‌ ఉండబోతుందట. గోల్డ్‌ కలర్‌ కోటెడ్‌ మెటీరియల్‌ తో ఈ సెట్‌ ను నిర్మించేందుకు సిద్దం అయ్యారు. చైనా నుండి ఈ సెట్‌ కోసం మెటీరియల్‌ ను తెప్పిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. శంకర్‌ చేసినా కూడా మామూలుగా ఉండదు అనేది ఇది మరో నిదర్శణంగా చెప్పుకోవచ్చు.