Begin typing your search above and press return to search.

'ప్రాజెక్ట్ K' లో ప్రభాస్ తో నటించే సువర్ణావకాశం..!

By:  Tupaki Desk   |   6 Sep 2021 2:30 PM GMT
ప్రాజెక్ట్ K లో ప్రభాస్ తో నటించే సువర్ణావకాశం..!
X
పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ''ప్రాజెక్ట్ K'' అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్ తో నటించే సువర్ణావకాశాన్ని మేకర్స్ కల్పిస్తున్నారు.

'ప్రాజెక్ట్ K' చిత్రానికి సంబంధించిన క్యాస్టింగ్‌ కాల్‌ వీడియో ప్రకటన విడుదలైంది. ''కెమెరా సెట్ చేయబడింది. ప్రాజెక్ట్K మీ రాష్ట్రానికి వస్తోంది. మీరొక యాక్టర్ మోడల్, డ్యాన్సర్, మార్షల్ ఆర్టిస్ట్ లేదా పెరఫార్మ్ చేయడానికి ఇష్టపడే ఎవరైనా ఉంటే, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఆడిషన్‌ కు మీ ప్రొఫైల్‌ ను మాకు మెయిల్ చేయండి'' అని మేకర్స్ ట్వీట్ చేశారు. బెంగుళూరు - చెన్నై నగరాల్లో సెప్టెంబర్ 12వ తేదీన.. పుదుచ్చేరి - కొచ్చి నగరాల్లో 15న ఆడిషన్స్ జరగనున్నట్లు వీడియోలో తెలిపారు. భారీ కాస్టింగ్ తో రూపొందనున్న ఈ సినిమాలో భాగం అయ్యే గోల్డెన్ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి.

ఇంతముందు ఒకసారి ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమాకి క్యాస్టింగ్ కాల్ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. 9- 14 సంవత్సరాల వయస్సు ఉన్న గర్ల్స్‌.. 20-35 ఏళ్లున్న ఫన్నీ క్యూరియస్ - ఎనర్జిటిక్ డ్యాన్సర్స్ - జిమ్నాస్టిక్ లో ప్రావీణ్యం ఉన్న జెంట్స్‌ కావాలని తెలిపారు. కాగా, సైన్స్ ఫిక్షన్ - సోషియో ఫాంటసీ జోనర్ లో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైన షెడ్యూల్ లో అమితాబ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రం కోసం ప్రభాస్ రెండు వందల రోజులు కాల్ షీట్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. డానీ శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.