Begin typing your search above and press return to search.

స్వ‌ర్ణోత్స‌వ సంబ‌రాలు.. సూప‌ర్ స్టార్ కు ఘ‌న స‌న్మానం!

By:  Tupaki Desk   |   15 March 2021 5:40 PM IST
స్వ‌ర్ణోత్స‌వ సంబ‌రాలు.. సూప‌ర్ స్టార్ కు ఘ‌న స‌న్మానం!
X
సూప‌ర్ స్టార్ కృష్ణ సార‌థ్యంలో.. విజ‌య‌కృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి 50 వ‌సంతాలు పూర్త‌య్యాయి. అదేవిధంగా ప‌ద్మాల‌య సంస్థ‌ను ప్రారంభించింది 52 సంవ‌త్స‌రాలు గ‌డిచాయి. ఈ అద్భుత‌మైన స‌మ‌యంలో స్వ‌ర్ణోత్స‌వ సంబ‌రాలను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు వార‌సులు!

ఆయ‌న‌తోప‌టు ప‌ద్మాల‌య సార‌థిగా ఉన్న జి.ఆదిశేష‌గిరిరావును, విజ‌య‌కృష్ణ‌ మూవీస్ అధినేత‌లు ఎస్‌.ర‌వికుమార్‌, ర‌మానంద్ ను సీనియ‌ర్ న‌రేష్‌, ఆయ‌న త‌న‌యుడు న‌వీన్ విజ‌య కృష్ణ ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా అలనాటి మధుర స్మృతుల‌ను నెమ‌రు వేసుకున్నారు.

'మీనా' చిత్రంతో ప్రస్థానం మొదలు పెట్టిన విజయకృష్ణ మూవీస్.. తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ సొంతం చేసుకుంది. నాటి నుంచి నేటి వ‌ర‌కు ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను ప్రొడ్యూస్ చేసిందీ బ్యాన‌ర్. కాగా.. ఇప్పుడు స్వ‌ర్ణోత్స‌వ వేళ‌.. ఈ బ్యాన‌ర్ ను న‌వీక‌రించారు. సీనియ‌ర్ న‌రేష్‌, ఆయ‌న కుమారుడు న‌వీన్ విజ‌య కృష్ణ ఆధ్వ‌ర్యంలో విజయకృష్ణ మూవీస్ ను.. 'విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్‌' పేరుతో రినోవేషన్ చేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలోనే ఈ స‌న్మానాలు నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో ప్ర‌ముఖ న‌టి జ‌య‌సుధ‌, న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఆనంద్ దేవ‌ర‌కొండ‌, సుధీర్ బాబు, వెంకటేష్ మ‌హా, శ్రీరామ్ ఆదిత్య‌, మాదాల ర‌వి, నిర్మాత శ‌ర‌త్ మ‌రార్‌, విఐ ఆనంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.