Begin typing your search above and press return to search.

'సలార్'లో ప్రభాస్ తో కలిసి నటించే గోల్డెన్ ఛాన్స్..!

By:  Tupaki Desk   |   9 Dec 2020 4:29 PM IST
సలార్లో ప్రభాస్ తో కలిసి నటించే గోల్డెన్ ఛాన్స్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా 'కేజీఎఫ్' ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్‌' అనే సినిమా రూపొందున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌ పై విజయ్‌ కిరంగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా సలార్ టీమ్ ఈ చిత్రంలో నటించే అరుదైన అవకాశాన్ని కలిగిస్తున్నట్లు ప్రకటించింది. 'సలార్' సినిమాకు సంబంధించిన ఆడిషన్స్‌ ఈ నెల 15న నిర్వహించనున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటనను విడుదల చేశారు.

నటనపై ఆసక్తి ఉన్నవారు డిసెంబర్‌ 15న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌ శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాలంటూ 'సలార్‌' మేకర్స్‌ తెలిపారు. ఏదైనా భాషలో ఓ నిమిషం పాటు నటించిన వీడియోని తీసుకురావాలని.. ఏజ్ లిమిట్ లేదని ప్రకటించింది. ఇలాంటి ఆడిషన్స్‌ త్వరలో బెంగళూరు, చెన్నై నగరాలలో కూడా నిర్వహిస్తామని వారు ప్రకటించారు. మరి డార్లింగ్ ప్రభాస్‌ పక్కన నటించే అరుదైన అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

కాగా, 'కేజీఎఫ్' దర్శకనిర్మాతలతో ప్రభాస్ అనౌన్స్ చేసిన 'సలార్' మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. 'ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్' అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ విడుదల చేసిన 'సలార్' టైటిల్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ వైలెంట్ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే జనవరిలో స్టార్ట్‌ చేస్తామని.. 2021లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.