Begin typing your search above and press return to search.
హాకీ ప్లేయర్ సత్తా చూపాడుగా!
By: Tupaki Desk | 1 Aug 2018 10:06 PM ISTకిలాడీ అక్షయ్ కుమార్ మరో స్ఫూర్తివంతమైన పాత్రలో నటిస్తున్నాడు. స్వాతంత్య్ర పోరాట సమయంలో తెల్లోళ్లు భారతదేశాన్ని పాలిస్తున్న వేళ మన దేశంలోని హాకీ క్రీడ పరిస్థితి ఎలా ఉండేదో చూపిస్తూ తెరకెక్కిస్తున్న `గోల్డ్` ఇప్పటికే అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. అక్కీ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త గెటప్ తో కనిపిస్తున్నాడు. తాజాగా రిలీజైన ఐమ్యాక్స్ ట్రైలర్ లో అతడి గెటప్ .. ఉద్విగ్నభరితమైన క్యారెక్టరైజేషన్ ఎంతో ఆసక్తి రేకెత్తించాయి.
బ్రిటీష్ వాళ్ల పాలనలో బ్రిటీష్ టీమ్‌పై హాకీ ఛాంపియన్ షిప్ నెగ్గి సత్తా చాటిన భారతీయుల కథను ఎంతో ఉద్విగ్నంగా తెరకెక్కించారని ట్రైలర్‌లో అక్కీ ఎమోషనల్ డైలాగులు చెబుతున్నాయి. ఆంగ్లేయుల దురహంకారంపై భారతీయుల గెలుపు అన్న చందంగా ఈ ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. రీమా కగ్తీ దర్శకత్వం వహించగా - రితేష్ సిద్వాణీ - మరో స్టార్ హీరో ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మించారు.