Begin typing your search above and press return to search.

23న‌ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా?

By:  Tupaki Desk   |   21 July 2022 3:35 PM GMT
23న‌ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా?
X
గ‌త కొంత కాలంగా నిర్మాణ వ్య‌యం పెరిగిపోయింద‌ని, ఓటీటీ ప్ర‌భావం, టికెట్ రేట్లు పెరిగిపోవ‌డం.. త‌దిత‌ర స‌మ‌స్య‌ల కార‌ణంగా మెజారిటీ వ‌ర్గం ప్రొడ్యూస‌ర్స్ త్వ‌ర‌లో షూటింగ్ ల‌ని బంద్ చేయాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నామంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

జూలై 23న జ‌రిగే కీల‌క భేటీలో దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని తెలిసింది. ఈ విష‌యమై ప్రొడ్యూస‌ర్స్ కౌంన్సిల్ స‌భ్యులు గురువారం ప్ర‌త్యేకంగా స‌మావేశం కావ‌డ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

థియేట‌ర్ల‌ల‌కు ఆడియ‌న్స్ రాక‌పోవ‌డం, స్టార్ హీరోల నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ లు పెంచేయ‌డం, కొంత మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు రోజులు, గంట‌లు లెక్క‌న చార్జ్ చేస్తున్నార‌ట‌.

అంటే కాకుండా జూనియ‌ర్ ఆర్టిస్ట్ లు కూడా ఇటీవ‌ల క‌నీస వేత‌నాలు పెంచాల్సిందే అంటూ మెరుపు స‌మ్మెకు దిగ‌డం, నిర్మాత‌ల మండ‌లికి, ఫెడ‌రేష‌న్ కు మధ్య అభిప్రాయ భేధాలు త‌లెత్త‌డం వంటి కార‌ణాల‌తో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ స‌భ్యులు ప్ర‌స్తుత స‌మ‌స్య‌ల‌న్నీ ఓ కొలిక్కి రావాలంటే ఆగ‌స్టు 1 నుంచి సినిమాల నిర్మాణం ఆపేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు.

జూనియ‌ర్ ఆర్టిస్ట్ లే కాదు మేము కూడా షూటింగ్ లు నిలిపివేసి బంద్ పాటిస్తామ‌ని నిరూపిస్తామ‌ని క‌ఠిన నిర్ణ‌యాల‌కు రెడీ అయిపోయారు. అయితే గురువారం స‌మావేశ‌మైన ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ సభ్యుల మాత్రం మేము అందుకు విరుద్ధ‌మ‌ని, షూటింగ్ లు నిలిపివేయాల‌న్న‌ది మా అభిమ‌తం కాద‌ని చెబుతున్నారు. స‌మావేశం అనంత‌రం నిర్మాత సి. క‌ల్యాణ్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర అంశాల‌ని వెల్ల‌డించారు.

సినిమాల కంటెంట్‌, ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో వుండేలా టికెట్ ధ‌ర‌లు, ఓటీటీల గురించి ప్ర‌ధానంగా చ‌ర్చించాం. యూనియ‌న్లు, ఫెడ‌రేష‌న్, మేనేజ‌ర్ల పాత్ర‌, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించాం. షూటింగ్ లు నిలిపివేయాలా? వ‌ద్దా? కొత్త ప్రాజెక్ట్‌లు కాకుండా అప్పుడే సెట్స్ పై వున్న వాటినే నిలిపివేయాలా?.. ఇలా అనేక కోణాల్లో చ‌ర్చించాం.

23న జ‌రిగే మీటింగ్ లో తుది నిర్ణ‌యం తీసుకుంటాం` అని తెలిపారు. గురువారం జ‌రిగిన మీటింగ్ లో సి. క‌ల్యాణ్ తో పాటు దిల్ రాజు, ప్ర‌స‌న్న కుమార్ , జెమిని కిర‌ణ్‌, ఠాగూర్ మధు, న‌ట్టికుమార్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, బెక్కెం వేణుగోపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.