Begin typing your search above and press return to search.

ఓటీటీలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ గర్జన.. ఎప్పటి నుంచో తెలుసా?

By:  Tupaki Desk   |   24 July 2021 2:30 AM GMT
ఓటీటీలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ గర్జన.. ఎప్పటి నుంచో తెలుసా?
X
ప్రపంచ‌వ్యాప్తంగా సినీ ప్రేమికులను అల‌రించిన‌ హాలీవుడ్ చిత్రాల్లో.. 'గాడ్జిల్లాVsకాంగ్‌' ఒక‌టి. గ‌తేడాది రిలీజ్ అయిన ఈ మూవీ.. భార‌తీయ చిత్రాల‌ను మించిన ఓపెనింగ్స్ తో రికార్డు క‌లెక్ష‌న్లు సాధించింది. ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజ్ కు రెండు రోజుల ముందుగానే ఇండియాలో రిలీజ్ అయిన ఈ చిత్రం దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు, హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రేక్ష‌కులు భారీగా ఆద‌రించారు. విడుద‌లైన తొలిరోజునే తెలుగు రాష్ట్రాల్లో రూ.4.5 కోట్లు సాధించి స‌త్తా చాటింది. రెస్ట్ ఆఫ్ ఇండియా, వ‌ర‌ల్డ్ లోనూ ఇదే విధంగా ద‌మ్ము చూపించింది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఈ చిత్రం డిజిట‌ల్ రిలీజ్ కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌. ఎట్ట‌కేల‌కు ఆ రోజు వ‌చ్చేసింది. స్వాతంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆగ‌స్టు 14వ తేదీ నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ మేర‌కు అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది.

ఇంగ్లీష్ తోపాటు హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది అమెజాన్ ప్రైమ్ సంస్థ‌. మొత్తానికి థియేట‌ర్లో రిలీజ్ అయిన ఐదు నెల‌ల త‌ర్వాత ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కాబోతోంది. థియేట‌ర్లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించిన 'గాడ్జిల్లాVsకాంగ్‌'.. ఓటీటీలో సైతం మంచి వ్యూస్ రాబ‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు క్రిటిక్స్‌. అస‌లే వినోదం కోసం ముఖం వాచిపోయి ఉన్నారు ప్రేక్ష‌కులు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాబోతున్న గాడ్జిల్లా వ‌ర్సెస్‌ కాంగ్ చేయ‌నున్న గ‌ర్జ‌న‌కు ఓటీటీ షేకై పోవ‌డం ఖాయంగా చెబుతున్నారు.