Begin typing your search above and press return to search.

#గాడ్సే లుక్‌: బెజ‌వాడ కుర్రాడి ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ గేమ్?

By:  Tupaki Desk   |   4 July 2021 4:30 PM GMT
#గాడ్సే లుక్‌: బెజ‌వాడ కుర్రాడి ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ గేమ్?
X
విభిన్న‌మైన క‌థాంశాల్ని ఎంచుకుని ప్ర‌తి సినిమాతో న‌టుడిగా త‌న‌ని తాను నిరూపించుకుని ఒక్కో మెట్టు ఎక్కుతున్న‌ హీరో స‌త్య త‌దుప‌రి మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారా? అంటే అవున‌నే తాజాగా రిలీజైన ఫ‌స్ట్ లుక్ చెబుతోంది. నేడు స‌త్య‌దేవ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌న‌ కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

గాడ్సే అనేది టైటిల్. గ‌న్ చేత‌ప‌ట్టి గుబురు గ‌డ్డంతో స‌త్య కాస్త ర‌ఫ్ గా రౌడీలా క‌నిపిస్తున్నాడు. ప‌లాస త‌ర‌హాలో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నార‌నే అర్థ‌మ‌వుతోంది. ఆస‌క్తిక‌రంగా ఈ మూవీ స్క్రిప్ట్‌ బాగా ఆకట్టుకోవడంతో కొర‌టాల శివ స‌మ‌ర్ప‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సత్య దేవ్ విజయవాడకు చెందిన యువకుడిగా న‌టిస్తున్నార‌ని ఈ రస్టిక్ డ్రామాను విజయవాడ పరిసరాల్లో చిత్రీకరించనున్నార‌ని తెలుస్తోంది.

స‌త్య‌దేవ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర‌బృందం స‌హా అభిమానులు సోష‌ల్ మీడియాల్లో శుభాకాంక్ష‌లు తెలిపారు. గోపాల్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ లో కృష్ణ కొమ్మలపతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండ‌గా.. నవీన్ నూలి త‌దిత‌ర సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు.