Begin typing your search above and press return to search.

గాడ్ ఫాద‌ర్ గుణపాఠం...వీర‌య్య అలెర్ట్!

By:  Tupaki Desk   |   12 Nov 2022 2:30 AM GMT
గాడ్ ఫాద‌ర్ గుణపాఠం...వీర‌య్య అలెర్ట్!
X
రిలీజ్ కి ముందు 'గాడ్ ఫాద‌ర్' ప్ర‌చారం విష‌యంలో ఎలాంటి పరిస్థితులు త‌లెత్తాయో తెలిసిందే. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతోన్న యూనిట్ స‌రిగ్గా ప్ర‌చార కార‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేద‌ని... ఏ ఈవెంట్ కూడా స‌రైన ప్ర‌ణాళిక‌తో నిర్వ‌హించ‌లేద‌ని....ఏకంగా సినిమా టీమ్ కే మీడియా స‌ల‌హాలు ఇచ్చింది. ఈ విష‌యంలో మీడియాపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ష‌న్ సైతం అంతే సీరియ‌స్ గానూ క‌నిపించింది.

ప్రచారం ఎలా నిర్వ‌హించాలో మీడియా వాళ్లు మాకు చెప్పాల్సిన ప‌నిలేద‌ని..మా సినిమా ఎలా ప్ర‌చారం చేసుకోవాలో మాకు తెలియ‌దా? అంటూ స్వీట్ గా రివ‌ర్స్ పంచ్ వేసేసారు. ఈ విష‌యంలో నెట్టింట కొంత చర్చ జ‌రిగిన‌ప్ప‌టికీ వాస్త‌వాలు గ్ర‌హించి త‌గ్గాల్సిన వాళ్లు వెన‌క్కి తగ్గ‌డంతో వ్య‌వ‌హారమంత సీరియ‌స్ కాలేదు. అయితే ఇలాంటి సమ‌స్య‌లు త‌దుప‌రి త‌లెత్త‌కుండా వాల్తేరు వీర‌య్య ముందుగానే అలెర్ట్ అయిన‌ట్లు సమాచారం.

ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న బాబి ప్ర‌చారం విష‌యంలో త‌న అనుమ‌తి లేకుండా ఏ ప‌ని జ‌ర‌గ‌డానికి వీలు లేద‌ని సీరియ‌స్ గా పీఆర్ టీమ్ ని ఆదేశించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే రిలీజ్ అయిన వీర‌య్య ప్ర‌చార చిత్రాల‌తో సినిమాకి భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. మెగా మాస్ లుక్ అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ రేపుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌చార ప‌రంగా ఎలాంటి త‌ప్పిదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఆ ప‌నులు కూడా త‌న ప్లానింగ్ ప్ర‌కార‌మే జ‌రిగాల‌ని బాబి రింగ్ లోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో లిరిక‌ల్ సింగిల్స్ ఒక్కొక్క‌టిగా రిలీజ్ కానున్నాయి. వాటిని ఎప్పుడు ఎలా రిలీజ్ చేయాలో బాబి ముందుగానే ఓ ప్లాన్ వేసుకుని ఆ ప్ర‌కారం రిలీజ్ చేయ‌మ‌ని పీఆర్ టీమ్ ని ఆదేశించాడుట‌.

సినిమా జ‌న‌వ‌రిలో రిలీజ్ కాబ‌ట్టి ఆ తేదీని బ‌ట్టి ప్ర‌చారం ప‌నుల‌న్నింటిని ఓ స్ర్టాట‌జీతో నిర్వ‌హించాల‌ని ఆదేశాలిచ్చిన‌ట్లు స‌మాచారం. రిలీజ్ వ‌ర‌కూ సినిమా పై అటెన్ష‌న్ ఉండాలంటే?ప్రేక్ష‌కుల్లో వీర‌య్య న‌ల‌గాల‌ని అంత వ‌ర‌కూ వీర‌య్య అప్ డేట్స ఒక్కొక్క‌టిగా ఇస్తూ ఉండాల‌ని సూచ‌న‌లిచ్చిన‌ట్లు తెలిసింది.

అలాగే టీమ్ కి సంబంధించిన ఇంట‌ర్వ్యూలు కూడా ఓ ప్లానింగ్ ప్రకారం జ‌ర‌గాల‌ని స‌ల‌హాలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.