Begin typing your search above and press return to search.

గోదావరి అల్లుడు అర్జున్ కుమార్ అల్లం వేంచేసారు

By:  Tupaki Desk   |   2 Feb 2022 6:43 AM GMT
గోదావరి అల్లుడు అర్జున్ కుమార్ అల్లం వేంచేసారు
X
విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `అశోక వ‌నంలో అర్జున కల్యాణం`. `పాగ‌ల్‌` ప‌రాజ‌యంతో ఈ సారి కొత్త‌గా ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో స‌రికొత్త క్యారెక్ట‌రైజేష‌న్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు విశ్వ‌క్ సేన్‌. ఆయ‌న న‌టిస్తున్న స‌రికొత్త చిత్రం `అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం`. విద్యాస‌పాగ‌ర్ చింత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ . బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌ వి సీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్ పై బాపినీడు, సుధీర్ ఈద‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మార్చి 4 న ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఫిబ్ర‌వ‌రి 2న ఈ చిత్ర టీజ‌ర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. `ఇంట‌ర్ క్యాస్ట్ అరేంజ్ మ్యారేజ్ సినిమాల్లోలాగా అయిత‌దారా.. అంటూ లేడీ వాయిస్ లో టీజర్ మొద‌లైంది. పెళ్లి చూసుల కోసం విశ్వ‌క్ సేన్ వెళ్ల‌డం.. పెళ్లి కూత‌రు త‌రుపు అమ్మాయి ఇప్ప‌టి వ‌ర‌కు మీరు ఎప్పి పెళ్లి సంబంధాలు చూశారు? అని అడ‌గ‌డం.. లెక్క‌పెట్ట‌లేద‌ని విశ్వ‌క్ సేన్ సిన్సియ‌ర్ గా చెప్ప‌డం.. అయితే పెద్ద నంబ‌రే అని అడిగిన అమ్మాయి అన‌డం ఆక‌ట్టుకుంటోంది.

గోదావ‌రి అల్లుడు గారు పెళ్లికి ముందే పిల్ల చుట్టూ తిరుగుతూ... అంటూ ఓ లేడీ వాయిస్ ... నీ పెళ్లి మా చావుకొచ్చింది క‌దరా అంటూ గోప‌రాజు ర‌మ‌ణ సెటైర్లు వేయ‌డం... చేసుకోవాల్సిన టైమ్ లో చేసుకుంటే ఈ కాశీ యాత్ర‌లు గోచీ యాత్ర‌లు త‌ప్పేవిగా.. అని కేదార్ శంక‌ర్ అన‌డం... క‌ట్ చేస్తే హీరోయిన్ విశ్వ‌క్ సేన్ చెంప ప‌గ‌ల‌గొట్ట‌డం... చీ దీన‌మ్మ తాగితే గానీ మా బ‌తుకుల‌కు ఏడుపురాదు.. తాగానోడి ఏడుపుకేమో వ్యాల్యూ లేదు.. అంటూ టీజ‌ర్ చివ‌ర్లో వివ్వ‌క్ సేన్ పంచ్ వేయ‌డం.. సినిమా ఓ ఫ్యామిలీ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సాగుతుంద‌నే క్లారిటీని ఇచ్చేస్తోంది.

హిట్టు కోసం త‌పిస్తున్న విశ్వ‌క్ సేన్ త‌న గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్న‌మైన పాత్ర‌ని ఈ చిత్రంలో పోషిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇందులో విశ్వ‌క్ సేన్ ది పెళ్లికాని ప్ర‌సాద్ లాంటి క్యారెక్ట‌ర్ .. వ‌య‌సు మీద‌ప‌డుతున్నా... పిల్ల దొర‌క్క అశోక్ కుమార్ అల్లం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు విద్యాసాగ‌ర్ చింత తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. టీజ‌ర్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తో పాటు పంచ్‌ల‌తో స‌ర‌దాగా సాగుతూ స‌రికొత్త ఫీల్ ని క‌లిగిస్తోంది.

టీజ‌ర్ లో చూపించిన స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఆస‌క్తి పెరిగింది. ఈ సినిమాతో విశ్వ‌క్ సేన్ ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకునేలా క‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టికే టైటిల్ తో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీని మార్చి 4న వ‌ర‌ల్డ్ వైడ్ గా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు.