Begin typing your search above and press return to search.
దేవుడు థ్రిల్లర్ మూవీ చూపిస్తున్నాడా? గ్యాస్ లీక్ పై వర్మ షాకింగ్ ట్వీట్స్
By: Tupaki Desk | 7 May 2020 3:40 PM ISTఎప్పుడు ఏ వివాదంలో నైనా తలదూర్చి తనదైన శైలిలో ట్వీట్స్ చేసి రచ్చ చేసే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఈ ప్రమాదంలో 8మంది చనిపోవడం.. 200 మందికిపైగా అస్వస్థతకు గురికావడం.. సృహ కోల్పోయి పడిపోయిన వీడియోలు వైరల్ కావడాన్ని చూసిన వర్మ ట్విట్టర్ లో షాకింగ్ కామెంట్స్ చేశారు.
వర్మ ట్వీట్ చేస్తూ.. ‘దేవుడే ఈ సృష్టికి మూలం. ప్రకృతిలోని అన్నింటిని నియంత్రణలో ఉంచుకుంటాడు. కానీ కరోనా వైరస్, విశాఖ గ్యాస్ లీక్ సంఘటనలు చూసిన తర్వాత భగవంతుడిని తప్ప అందరినీ తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది’ అంటూ వేధాంతం చెప్పారు వర్మ. ఈ కరోనా, విశాఖ గ్యాస్ లీక్ చూస్తుంటే ఆ దేవుడికి మానసిక సమస్యలేమైనా తలెత్తాయా అన్న సందేహం కలుగుతోందని వర్మ దేవుడికే కౌంటర్ ఇవ్వడం విశేషం.ఈరోజు అంతా ఈ గ్యాస్ లీక్ పై వర్మ వరుసగా ట్వీట్స్ చేస్తూ పోయారు.
ఇక మతం, కులం, జాతీయత అనే తేడా ఏం లేకుండా పురుషులను, మహిళలను, పిల్లలను సైతం చంపేవి ఈ ప్రపంచంలో మూడే ఉన్నాయని వర్మ ట్వీట్ లో పేర్కొన్నారు. టెర్రరిస్టులు, వైరస్ లు, దేవుడు తరతమ భేదం లేకుండా అందరినీ ఒకే గాటిన చంపేస్తుంటాడని వర్మ ఆవేదన సైతం వ్యక్తం చేశారు.
ఇక కరోనా వైరస్ తర్వాత మనుషులపై గ్యాస్ ఎటాక్ జరిగిందని.. ఇక గ్రహాంతరవాసుల దాడి మాత్రమే మిగిలిందని వర్మ సెటైర్లు వేశారు. సినీ రంగం మూతపడిన తర్వాత దేవుడు తన స్టైల్లో థ్రిల్లర్ మూవీని విశాఖ గ్యాస్ లీక్ తో చూపించాడని వర్మ పేర్కొన్నారు.
ఇలా లాక్ డౌన్ తో ఖాళీగా ఉన్న వర్మ విశాఖ గ్యాస్ ఘటనపై ఆ దేవుడికి కౌంటర్ ఇస్తూనే తనదైన స్టైల్లో ట్వీట్లు పెట్టి సంచలన కామెంట్లతో హోరెత్తిస్తున్నాడు.