Begin typing your search above and press return to search.

ఒక్క గాడ్‌ ఫాదర్‌ ఎన్నో సినిమాలకు లైన్ క్లీయర్ చేసింది

By:  Tupaki Desk   |   8 Oct 2022 9:38 AM GMT
ఒక్క గాడ్‌ ఫాదర్‌ ఎన్నో సినిమాలకు లైన్ క్లీయర్ చేసింది
X
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్‌ టాక్ దక్కించుకుంది.. మంచి వసూళ్లు సాధిస్తున్న గాడ్‌ ఫాదర్‌ సినిమా ఒక వైపు మెగాస్టార్‌ చిరంజీవి తో పాటు మరో వైపు దర్శకుడు మోహన్‌ రాజాకి కూడా చాలా ఊరట కలిగించింది అనడంలో సందేహం లేదు. మోహన్‌ రాజా చేసిన గాడ్‌ ఫాదర్ ఫలితాన్ని బట్టి ఆయన తదుపరి సినిమాల యొక్క భవితవ్యం ఆధారపడి ఉంది.

గాడ్‌ ఫాదర్‌ సినిమా సక్సెస్ అయిన వెంటనే చాలా రోజులుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న నాగార్జున తో సినిమా పట్టాలెక్కబోతుంది. నాగార్జున తన బెంచ్ మార్క్ సినిమా అయిన వందవ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలను మోహన్‌ రాజాకి ఇచ్చేందుకు నాగార్జున ఓకే చెప్పాడు అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ బెంచ్ మార్క్ మూవీ లో అఖిల్‌ కూడా కనిపించబోతున్నాడు.

ఇక మోహన్‌ రాజా దర్శకత్వంలో తమిళంలో ఒక స్టార్‌ హీరో సినిమా గత రెండు మూడు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఆ సినిమా కూడా తాజాగా గాడ్‌ ఫాదర్‌ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో కన్ఫర్మ్‌ అయ్యిందని సమాచారం అందుతోంది.

ఇక మోహన్ రాజా సూపర్ హిట్ మూవీ తని ఒరువన్‌ సీక్వెల్‌ గురించి ప్రస్తుతం చర్చ మొదలు అయ్యింది. స్వయంగా మోహన్‌ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తని ఒరువన్‌ సీక్వెల్‌ ను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. తని ఒరువన్‌ కి రీమేక్‌ గా చరణ్‌ ధృవ చేసిన విషయం తెల్సిందే.

ఇప్పుడు ధృవ కి కూడా సీక్వెల్‌ చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. తని ఒరువన్‌ సీక్వెల్‌ కథను సోదరుడు రవికి చెప్పగా నచ్చింది చేద్దాం అన్నాడని.. అదే కథను రామ్‌ చరణ్ కి చెప్పగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ధృవ 2 ని రామ్‌ చరణ్ తో చేయాలని తాను భావిస్తున్నట్లుగా మోహన్ రాజా చెప్పుకొచ్చాడు.

ధృవ మొదటి పార్ట్ కి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. సీక్వెల్‌ అంటూ చేస్తే అది తానే దర్శకత్వం చేస్తానంటూ మోహన్‌ రాజా తాజా ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్‌ గా తెలియజేశారు. గాడ్‌ ఫాదర్‌ సినిమా సక్సెస్‌ చేశాడు కనుక కచ్చితంగా మోహన్‌ రాజాకి ధృవ 2 చేసే బాధ్యతలు రామ్‌ చరణ్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒక్క గాడ్‌ ఫాదర్‌ సక్సెస్ తో మోహన్‌ రాజా రాబోయే నాలుగు అయిదు ఏళ్లు బిజీ అయ్యేంతగా సినిమాలకు లైన్‌ క్లీయర్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.