Begin typing your search above and press return to search.
గోవా ఇఫీ ఫిలింఫెస్టివల్స్-2019 ట్రీట్
By: Tupaki Desk | 15 July 2019 3:19 PM ISTగోవా అంతార్జాతీయ సినిమా ఉత్సవాల(ఇఫీ)కు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. భారతదేశం తరపున ప్రతియేటా ఈ అధికారిక సినిమా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రతియేటా 150 పైగా దేశాలు ఈ ఉత్సవాలకు ఎటెండవుతూనే ఉన్నాయి. ఈసారి అంతకుమించి వైభవంగా ఇఫీ ఉత్సవాల్ని నిర్వహించనున్నారు. నవంబర్ 28 నుంచి ఎనిమిది రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో ఈసారి ఏకంగా 200 దేశాలు పాల్గొంటున్నాయి. ఇఫీ ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకల్ని ఎంతో ఘనంగా చేయనున్నారని తెలుస్తోంది.
నవంబర్ 28 వరకు 8 రోజుల పాటు 50వ గోవా ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ -2019 వేడుకలు జరగనున్నాయని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ సమావేశంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. రాహుల్ రావేల్.. వీళ్లతో పాటు మధుర్ భండార్కర్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆసక్తికరంగా ఈసారి దర్శకనిర్మాతలు కరణ్ జొహార్.. సుభాష్ ఘాయ్ లాంటి వారిని ఈ ఉత్సవాల స్టీరింగ్ కమిటీలో చేర్చారు.
ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా ఔత్సాహిక ఫిలింమేకర్స్ పాల్గొంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలా టిక్కెట్టు ధరను నిర్ణయించేందుకు కసరత్తు సాగుతోందట. అలాగే ఉత్సవాల ఏర్పాట్లను జవేదకర్ పర్యవేక్షిస్తారు. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగస్వామి అయ్యేందుకు అగ్ర రాజ్యం రష్యా కూడా ఆసక్తిగా ఉందని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఆస్కార్ అవార్డులిచ్చే సంస్థ ఛైర్మన్ జాన్ బెయిలీ… కూడా ఫిల్మ్ ఫెస్టివల్ కు విచ్చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని ఆయన తెలిపారు.