Begin typing your search above and press return to search.

'అన్ ఫెయిర్' పాత్రలో గోవాబ్యూటీ.. హిట్టు కొడుతుందా??

By:  Tupaki Desk   |   14 Jan 2021 1:30 AM GMT
అన్ ఫెయిర్ పాత్రలో గోవాబ్యూటీ.. హిట్టు కొడుతుందా??
X
టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్నేళ్ల పాటు తన అందాల ఆరబోతతో అలరించింది గోవా బ్యూటీ ఇలియానా. తెలుగు సినిమాలలో మాత్రం తన వయ్యారాలను మాములుగా ఒలికించలేదు. 'దేవదాస్' సినిమాతో తెలుగు తెర పై అడుగుపెట్టిన ఈ బ్యూటీ తక్కువ టైంలోనే టాప్ హీరోల సరసన నటించి బాక్సాఫీస్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకొని పోకిరి, జల్సా, కిక్ సినిమాలతో అభిమానుల కలలరాణిగా వెలిగిపోయింది. జులాయి సినిమా తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది కానీ తన రేంజిలో ఆకట్టుకోలేదు. సినీ ఫీల్డ్ అంటే పోటీ ప్రపంచం అని అందరికి తెలిసిందే. కాస్త ఆలస్యం అయినా వెనక్కి పడిపోతుంటారు. అడపాదడపా తమిళ సినిమాలలో కనిపించిన ఇలియానా.. బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఫస్ట్ మూవీతో క్రేజ్ పెరిగినప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.

ఆ మధ్య తెలుగులో కేవలం తనను గ్లామర్ పాత్రలకే అంకితం చేసారని, అందుకే నాకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దొరకలేదని వాపోయింది. హిందీలో ఇంతమంచి పాత్రలు చేసినా అవకాశాలు మాత్రం దూరంగానే ఉంటున్నాయట. ఇక చేసేదేం లేక వచ్చిన పాత్రలనే చేసుకుంటూ వెళ్తుంది. చివరగా ఇలియానా చేసిన 'పాగల్ పంతి' కూడా ప్లాప్ అయింది. ప్రస్తుతం ఇలియానా హిందీ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఇలియానాను గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా ఇష్టపడతారు అభిమానులు. అయితే ప్రస్తుతం ఈ భామ గ్లామర్ పక్కన పెట్టి 'అన్ ఫెయిర్ అండ్ లవ్లీ' అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఇలియానా పూర్తి డీగ్లామరస్ పాత్రలో కనిపించనుందట. ఈ వార్త ఇల్లి అభిమానులకు కష్టమే అనిపించినా ఇది నిజం. బలవీందర్ సింగ్ జాంజా దర్శకత్వంలో రందీప్ హుడా సరసన ఇలియానా సినిమా చేస్తోంది. సోనీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సమాజంలో వర్ణబేధాల పై మంచి మెసేజ్ ఇవ్వనుందట. చూడాలి మరి ఇలియానాకి ఈ విధంగా అయినా హిట్ పడుతుందేమో..!!