Begin typing your search above and press return to search.

గంజి తాగడ‌మే త‌న గ్లామర్ సీక్రెట్ అంటున్న గ్లామరస్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   27 April 2021 7:00 AM IST
గంజి తాగడ‌మే త‌న గ్లామర్ సీక్రెట్ అంటున్న గ్లామరస్ బ్యూటీ..!
X
'నువ్విలా' చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది షైనింగ్ బ్యూటీ యామీ గౌతమ్. ఈ క్రమంలో తెలుగులో 'గౌరవం' 'యుద్ధం' 'కొరియర్ బాయ్ కల్యాణ్' వంటి చిత్రాల్లో నటించింది. అలానే ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో బాగా పాపులర్ అయింది. ఇక 'విక్కీ డోనర్‌' సినిమాతో బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. 'బద్లాపూర్' 'సనమ్ రే' 'కాబిల్' 'ఉరి' 'బాలా' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ వస్తున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రసీమలో తన మార్క్ గ్లామర్‌ తో ఆకట్టుకుంటోంది. ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కించే యామీ.. తాజాగా తన గ్లామర్ సీక్రెట్ ఏంటో బయట పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తో పాటుగా గంజి తాగడ‌మే త‌న గ్లామర్ ర‌హ‌స్యం అని చెబుతోంది యామీ గౌత‌మ్. అంతేకాకుండా రోజు విడిచి రోజు చ‌ద్ది అన్నం తిన‌డం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని ఈ బ్యూటీ టిప్స్ ఇస్తోంది. ఇకపోతే బాలీవుడ్ లో ఓ మెరుపు మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మళ్ళీ సౌత్ ఇండస్ట్రీ తలుపు తట్టాలని చూస్తోంది. అయితే సౌత్ లో తెలుగు తమిళ మలయాళంలో ఈ భామ యాక్ట్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ 2' త‌రువాత కన్నడ రాకింగ్ స్టార్ య‌శ్ నటించే పాన్ ఇండియా సినిమాలో యామీ గౌతమ్ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని బాంబే కాస్టింగ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఓటీటీలో విడుదలైన 'గిన్నీ వెడ్స్‌ సన్నీ' అనే చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ.. 'భూత్‌ పోలీస్‌' 'దాస్వి' 'ఎ థర్స్ డే' వంటి సినిమాల్లో నటిస్తోంది.