Begin typing your search above and press return to search.

గ్లామర్ బ్యూటీని డీగ్లామరస్ పాత్రలో చూసేదెలా..!

By:  Tupaki Desk   |   21 March 2020 11:40 AM IST
గ్లామర్ బ్యూటీని డీగ్లామరస్ పాత్రలో చూసేదెలా..!
X
ఇలియానా.. దక్షిణ భారత సినీ ప్రపంచాన్ని కొన్నేళ్ల పాటు తన అందచందాలతో ముంచెత్తింది. ముఖ్యంగా తెలుగు తెరపై మాత్రం తన గ్లామర్ ను మాములుగా గుప్పించలేదు. 'దేవదాస్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ తక్కువ టైంలోనే టాప్ హీరోల సరసన నటించి బాక్స్ ఆఫీస్ హిట్లను చవిచూసింది. మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకొని పోకిరి, జల్సా, కిక్ సినిమాలతో సినీ అభిమానుల కళలరాణిగా వెలిగిపోయింది.

ఇక జులాయి సినిమా హిట్ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది కానీ సరైన అవకాశాలు మాత్రం దక్కలేదు. గ్లామర్ ఫీల్డ్ అంటేనే పోటీ ప్రపంచం అని అందరికి తెలిసిందే. రెండు మూడు తమిళ్ సినిమాలలో కనిపించి మెప్పించిన ఇల్లి బేబీ, బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఫస్ట్ మూవీతో క్రేజ్ పెరిగినప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. తెలుగులో కేవలం తనను గ్లామర్ పాత్రలకే అంకితం చేసారని, అందుకే నాకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దొరకలేదని వాపోతుంది.

హిందీలో ఇంతమంచి పాత్రలు చేసినా అవకాశాలు ఈమె గ్లామర్ కి దూరంగానే నిలిచాయి. ఇక చేసేదేం లేక వచ్చిన పాత్రలనే చేసుకుంటూ వెళ్తుంది. చివరగా ఇలియానా చేసిన 'పాగల్ పంతి' కూడా ప్లాప్ అయింది. ప్రస్తుతం ఇలియానా హిందీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవలే తన మ్యారేజ్ లైఫ్ కూడా ప్లాప్ అవ్వడంతో మళ్లీ సినిమాల పై ఫోకస్ పెడుతోంది. తాజాగా 'అన్ ఫెయిర్ అండ్ లవ్లీ' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఈ గ్లామర్ బ్యూటీ డీగ్లామరస్ పాత్రలో కనిపించనుందట. చూడాలి మరి ఈసారైనా హిట్ అందుకుంటుందేమో..