Begin typing your search above and press return to search.

'శంకర్ - చరణ్' ప్రాజెక్ట్ పై కాస్త క్లారిటీ ఇవ్వండయ్యా..!

By:  Tupaki Desk   |   5 Jun 2021 10:00 PM IST
శంకర్ - చరణ్ ప్రాజెక్ట్ పై కాస్త క్లారిటీ ఇవ్వండయ్యా..!
X
షో మ్యాన్ శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కమల్ హాషన్ తో రూపొందిస్తున్న 'ఇండియన్ 2' సినిమా డిలే అవుతుండంతో చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడు శంకర్. దీంతో మెగా అభిమానులు ఖుషీ అయ్యారు. RC15 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్తుందని అనుకుంటుండగా.. 'ఇండియన్ 2' వివాదం శంకర్ ను కోర్టు దాకా తీసుకెళ్లింది.

శంకర్‌ పై ‘ఇండియన్‌ 2’ చిత్ర నిర్మాణ సంస్థ లైకా మద్రాస్‌ కోర్టులో కేసు వేసింది. తమ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమాలకు దర్శకత్వం వహించకుండా శంకర్ ను ఆదేశించాలని కోరింది. దీంతో ఇప్పుడు చరణ్ తో సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయం మీద క్లారిటీ లేకుండా పోయింది. త్వరలోనే RC15 ఉంటుందా లేదా 'భారతీయుడు 2' సినిమాని పూర్తి చేసిన తర్వాత ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ ఫైనల్ స్టేజికి వచ్చేసింది. రెండు పాటలు - ఒక వారం రోజుల్లో పూర్తయ్యే టాకీ పార్ట్ పెండింగ్ ఉంది. షూటింగులకు అనుమతి వచ్చిన వెంటనే తిరిగి చిత్రీకరణ ప్రారంభించనున్నారు. 'ఆచార్య' షూటింగ్ కూడా మరో 10 రోజుల్లో పూర్తవుతుంది. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ ఫ్రీ అయిపోతాడు. అందరు స్టార్ హీరోలు ముందే రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకొని ఉంటే చెర్రీ మాత్రం శంకర్ నే నమ్ముకొని ఉన్నాడు. ఈ నేపథ్యంలో RC15 విషయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పష్టత ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి త్వరలోనే రాం చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.