Begin typing your search above and press return to search.

గిరగిరా ప్రేమ - లిరికల్ వీడియో

By:  Tupaki Desk   |   20 Jun 2019 12:26 PM IST
గిరగిరా ప్రేమ - లిరికల్ వీడియో
X
వచ్చే నెల విడుదల కానున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు ఆడియో సింగిల్స్ ఆన్ లైన్ లో రచ్చ చేయగా ఇప్పుడు మూడోది వచ్చేసింది. గిరగిరమని తిరగలి లాగా తిరిగి ఆరిగి పోయినా దినుసైనా నలగలేదులే అంటూ మొదలెట్టి తన ప్రియుడు/ప్రియురాలి వెనుక ఎంత ప్రయత్నించినా అలిసిపోవడమే తప్ప ఇంకే ఫలితం దక్కలేదు అని అర్థం వచ్చేలా రాసిన రెహమాన్ లిరిక్స్ బాగున్నాయి.

రెగ్యులర్ గా వచ్చే లవ్ మెలోడీస్ కి భిన్నంగా సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్ దీనికి ఇచ్చిన మ్యారేజ్ సందర్భాన్ని వాడుకున్న తీరు బాగుంది. ఫాస్ట్ బీట్ లేకుండా సింపుల్ మెలోడీగా క్యాచీ ట్యూన్ లో ఇంకోసారి వెంటనే వినొచ్చు అనేలా కంపోజ్ చేసిన తీరు మ్యూజిక్ లవర్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. లిరికల్ వీడియోస్ లో చూపించిన దాన్ని బట్టి ఇదేదో ఫంక్షన్ లో వచ్చే పాటలా ఉంది. ఒకపక్క వేడుక జరుగుతుండగానే ఒకరికోసం ఒకరు పరితపిస్తూ ప్రేమను అడిగే తీరులో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న విజువల్స్ చాలా కూల్ గా ఉన్నాయి.

ఇది పెళ్లి పాట కాదు. ఆ నేపధ్యాన్ని తీసుకుని ప్రేమికులు తమ భావాలను ఆవిష్కరించిన గీతం. చిన్న చిన్న పదాలతోనో రెహమాన్ ఇంపాక్ట్ చూపించగలిగాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ ఫీల్ తో వస్తున్న డియర్ కామ్రేడ్ ఆడియో మొత్తానికి అంచనాలకు తగ్గట్టే సాగుతోంది. బిగ్ బెన్ సినిమాస్ తో మైత్రి మూవీస్ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న డియర్ కామ్రేడ్ ద్వారా భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వచ్చే నెలాఖరున డియర్ కామ్రేడ్ విడుదల కానుంది