Begin typing your search above and press return to search.

'జిన్నా' భాయ్ గా మాసీ లుక్ లో మంచు విష్ణు..!

By:  Tupaki Desk   |   11 July 2022 6:13 AM GMT
జిన్నా భాయ్ గా మాసీ లుక్ లో మంచు విష్ణు..!
X
టాలీవుడ్ హీరో విష్ణు మంచు నటిస్తున్న తాజా చిత్రం ''జిన్నా''. ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో 'Rx 100' భామ పాయల్ రాజ్ పుత్ మరియు హాట్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే టైటిల్ ను ఆవిష్కరించిన మేకర్స్.. లేటెస్టుగా సినిమాలో విష్ణు పోషిస్తున్న గాలి నాగేశ్వరరావు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

'జిన్నా' షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే హీరోయిన్లతో కలిసి సినిమాని వినూత్న రీతిలో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు విష్ణు. ఇప్పుడు ఫస్ట్ లుక్ ని కూడా అదే విధంగా ఒక మేకింగ్ వీడియో మాదిరిగా లాంచ్ చేశారు. డైరెక్టర్ సూర్య - సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు మరియు ఫైట్ మాస్టర్ రామకృష్ణన్ షాట్ రెడీ అయ్యిందని విష్ణును పిలవమని చెప్తారు.

'విష్ణు గారు... షాట్ రెడీ' అని హీరో గారూ షాట్ రెడీ అని అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఎంత పిలిచినా విష్ణు తనకు ఏం పట్టనట్లు అలానే ఉండిపోతాడు. అప్పుడే సెట్స్ లోకి ఎంటర్ అయిన డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ సూచన మేరకు 'జిన్నా.. షాట్ రెడీ' అని పిలవగానే విష్ణు ఓ గోడపై నుంచి జంప్ చేయడాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు.

'జిన్నా' ఫస్ట్ లుక్ లో విష్ణు వైట్ అండ్ వైట్ డ్రస్‌ లో మెడలో స్కార్ఫ్ వేసుకొని క్రేజీగా కనిపించాడు. రఫ్ గడ్డంతో కళ్ళజోడు పెట్టుకొని మాసీగా ఉన్నాడు. మాస్ - కామెడీ - యాక్షన్.. ఇది జిన్నా భాయ్ స్టైల్ అని విష్ణు పేర్కొన్నారు. మన గాలి నాగేశ్వరరావు జిన్నా గా ఎలా మారాడనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

మంచు అవ్రమ్ భక్త సమర్పణలో ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోన వెంక‌ట్ క‌థ‌ - స్క్రీన్ ప్లే అందించ‌డ‌మే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులోని పాటలకు ప్రభుదేవా - గణేష్ ఆచార్య - ప్రేమ్ రక్షిత్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. లేటెస్టుగా వచ్చిన విష్ణు ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ ను డిజైన్ చేసింది కూడా ప్రేమ్ రక్షిత్ మాస్టరే.

''జిన్నా'' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 'మోసగాళ్ళు' సినిమాతో పరాజయం మూటగట్టుకున్న విష్ణు మంచు.. ఇప్పుడు 'జిన్నా' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.