Begin typing your search above and press return to search.

ఊటీలో వేట సాగిస్తున్న ఘోస్ట్..!

By:  Tupaki Desk   |   8 April 2022 5:11 AM GMT
ఊటీలో వేట సాగిస్తున్న ఘోస్ట్..!
X
కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ''ది ఘోస్ట్''. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సోనాలి చౌహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'ది ఘోస్ట్' మూవీకి సంబంధించిన దుబాయ్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు - యాక్షన్ ఘట్టాలతో పాటుగా ఒక సాంగ్ ను చిత్రీకరించారు.

ఇదే క్రమంలో తదుపరి షెడ్యూల్ ను చిత్ర యూనిట్ ఊటీలో ప్రారంభించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియచేశారు చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ''ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి'' అంటూ 'ది ఘోస్ట్' షూటింగ్ లొకేషన్ లోని ఓ పిక్ షేర్ చేశారు.

ఈ చిత్రాన్ని గ్రాండ్ విజువల్స్ తో అధునాతన సాంకేతికతతో అద్భుతమైన లొకేషన్స్ లో గ్రాండ్ స్కేల్ లో రూపొందిస్తున్నారని అర్థం అవుతోంది. ఇందులో నాగార్జున - సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా కనిపించనున్నారు. గుల్ పనాంగ్ - అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'ది ఘోస్ట్' మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో నాగ్ గెటప్ మరియు ఆయన మేకోవర్ అక్కినేని అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహనరావు - శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ముఖేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. రాబిన్ సుబ్బు మరియు నభా మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

'బంగార్రాజు' వంటి బ్లాక్ బస్టర్ నాగార్జున నుంచి రాబోతున్న ''ది ఘోస్ట్'' సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దర్శకుడు ప్రవీణ్ సత్తారు 'పీఎస్వీవీ గరుడ వేగ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందిస్తారని నమ్ముతున్నారు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.