Begin typing your search above and press return to search.

మరో ప్రయోగానికి సిద్ధమైన నాగ్ ఘోస్ట్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   10 Jun 2022 10:30 AM GMT
మరో ప్రయోగానికి సిద్ధమైన నాగ్ ఘోస్ట్ డైరెక్టర్
X
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ టాలెంటెడ్ దర్శకులలో ప్రవీణ్ సత్తారు ఒకరు. చందమామ కథలు సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రవీణ్ ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త తరహా కథను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు. చివరగా ఈ దర్శకుడు రాజశేఖర్ తో గరుడ వేగా అనే సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది విమర్శకుల ప్రశంసలు అందుకున్న అప్పటికి కూడా పూర్తి స్థాయిలో కమర్షియల్ గా అయితే కలెక్షన్స్ అందుకోలేదు.

ఇక ఈ సారి నాగార్జునతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవాలని ప్రవీణ్ సత్తారు ఘోస్ట్ అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇందులో నాగార్జున ఒక పవర్ఫుల్ ఏన్ఐఏ ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. వీలైనంత తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

అయితే ప్రవీణ్ సత్తారు ఇంతలోనే మరో కొత్త ప్రాజెక్టు పై కూడా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఫిలిం రిపబ్లిక్‌కి చెందిన ప్రణతిరెడ్డి నిర్మిస్తున్న మరో ప్రాజెక్ట్‌కి దర్శకుడు సంతకం చేసినట్లు సమాచారం. పోస్టర్‌ను పరిశీలిస్తే, ఇది ZEE5 కోసం వెబ్ సినిమా లేదా సిరీస్ అని తెలుస్తోంది. మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

మరోవైపు వరుణ్ తేజ్ తో ప్రవీణ్ సత్తారు ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ సినిమాలో నాగబాబు కూడా ఒక నిర్మాత తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆ సినిమాను కూడా భారీ యాక్షన్ ఫిలిమ్ గా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి కథ కూడా సిద్ధమైనట్లు సమాచారం. కథ పై కాన్ఫిడెంట్ గా ఉండడం తోనే నాగబాబు మళ్ళీ చాలాకాలం తర్వాత ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.