Begin typing your search above and press return to search.

ట్యాలెంటెడ్ సునీల్ శెట్టికి `గ‌ని` టీమ్ బిడే విషెస్

By:  Tupaki Desk   |   11 Aug 2021 3:30 PM GMT
ట్యాలెంటెడ్ సునీల్ శెట్టికి `గ‌ని` టీమ్ బిడే విషెస్
X
ఖాన్ ల‌తో ధీటుగా పోటీప‌డుతూ హీరోగా ఎద‌గ‌డంలో కిలాడీ అక్ష‌య్ కుమార్ త‌న‌ని తాను నిల‌బెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఖాన్ ల‌ను మించిన సక్సెస్ రేటుతో ఇప్ప‌టికీ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. అయితే అక్ష‌య్ తో స‌మాన హోదాను స్టార్ డ‌మ్ ను ఎంజాయ్ చేసిన సునీల్ శెట్టి ఒకానొక ద‌శ‌లో వ‌ర‌స ఫ్లాప్ ల‌తో రేసులో వెన‌క‌బ‌డ్డారు. త‌న యాటిట్యూడ్ సేఫ్ జోన్ ని వెతుక్కోవ‌డ‌మే తాను రేసులో వెన‌క‌బ‌డ‌డానికి కార‌ణ‌మ‌ని సునీల్ శెట్టి చాలాసార్లు అంగీక‌రించారు. ఇత‌ర హీరోల్లా తాను ప్ర‌యోగాలు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని నిర్మాత‌ల సేఫ్టీ ఆలోచించడ‌మే అందుకు కార‌ణ‌మ‌ని కూడా అన్నారు.

ప్ర‌స్తుతం సునీల్ శెట్టి సౌత్ సినిమాల‌లో విల‌న్ పాత్ర‌లు పోషిస్తూ ఇక్క‌డివారికి ట‌చ్ లో ఉన్నారు. ఇంత‌కుముందు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా మురుగ‌దాస్ తెర‌కెక్కించిన ద‌ర్బార్ చిత్రంలో క్రూరుడైన విల‌న్ గా న‌టించిన సునీల్ శెట్టి త‌న రూపం న‌టన‌తో మెస్మ‌రైజ్ చేశారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న గ‌ని చిత్రంలోనూ సునీల్ శెట్టి విల‌న్ గా క‌నిపించ‌నున్నారు.

నేడు సునీల్ శెట్టి బ‌ర్త్ డే సంద‌ర్భంగా `గ‌ని` టీమ్ ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపింది. `గ‌ని` బాక్సింగ్ నేప‌థ్యంలో ఆద్యంతం ఎమోష‌న‌ల్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా జార్జి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వేగంగా పెండింగ్ ప‌నులు స‌హా నిర్మాణానంత‌ర ప‌నుల్ని ముగించి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు ఆస‌క్తిగా ఉన్నారు.