Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లు బాక్సింగ్ రింగ్ లో ఇప్పుడు రొమాంటిక్ 'గని'

By:  Tupaki Desk   |   4 Nov 2021 11:22 AM GMT
ఇన్నాళ్లు బాక్సింగ్ రింగ్ లో ఇప్పుడు రొమాంటిక్ గని
X
మెగా హీరో వరుణ్‌ తేజ్‌ త్వరలో గని సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమాను అల్లు బాబీ మరియు సిద్దు ముద్ద లు సంయుక్తంగా అల్లు అరవింద్‌ సమర్పణలో నిర్మిస్తున్నారు. అల్లు బాబు ఈ సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారుతున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్‌ తేజ్ బాక్సర్‌ గా కనిపించబోతున్న విషయం ఇప్పటికే రివీల్ అయ్యింది. ఈ సినిమాలోని బాక్సింగ్ సన్నివేశాల కోసం చాలా స్పెషల్‌ గా విదేశాల్లో అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్స్ వద్ద వరుణ్‌ తేజ్ ట్రైనింగ్‌ అయ్యాడని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గని సినిమా అనగానే బాక్సింగ్‌ చేస్తున్న వరుణ్‌ తేజ్‌.. రక్తం కారుతున్న వరుణ్‌ ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. మొదటి సారి దీపావళి సందర్బంగా రొమాంటిక్ గనిని విడుదల చేశారు.

గని సినిమాలో హీరోయిన్ గా వరుణ్‌ కు జోడీగా సాయి మంజ్రేకర్‌ నటించిన విషయం తెల్సిందే. తెలుగు లో సాయి మంజ్రేకర్‌ ఇంతకు ముందే పరిచయం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా ఇతరత్ర కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. గని సినిమా తో సాయి మంజ్రేకర్‌ భారీగా ఎంట్రీ ఇవ్వబోతుంది. నమ్రత శిరోద్కర్ కు సాయి మంజ్రేకర్‌ సన్నిహితురాలు అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కాని టాలీవుడ్‌ లో ఖచ్చితంగా సాయి మంజ్రేకర్‌ కు మంచి గుర్తింపు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఆమె ఫస్ట్‌ లుక్ ను ఇలా రివీల్ చేశారు. వరుణ్ తేజ్‌ తో నటించే అవకాశం దక్కించుకుంది అంటే ఖచ్చితంగా ఆమె మంచి ఫిజిక్ ముఖ్యంగా హైట్ ను కలిగి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అంటున్నారు.

గని సినిమా ను డిసెంబర్‌ 3న థియేటర్ల ద్వారా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు కూడా వచ్చాయి. థమన్‌ సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న గని సినిమా తో పాటు ఎఫ్‌ 3 సినిమా ను కూడా వరుణ్ తేజ్ చేస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వం లో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఆ సినిమా లో వెంకటేష్ తో కలిసి వరుణ్‌ తేజ్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఎఫ్‌ 3 లో వరుణ్‌ తేజ్ కు మెహ్రీన్‌ జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. గని ఈ ఏడాది విడుదల అయితే వచ్చే ఏడాది సమ్మర్ లో ఎఫ్ 3 సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలోనే మరో సినిమాను కూడా విడుదల చేసేలా వరుణ్‌ తేజ్ ప్లాన్‌ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.