Begin typing your search above and press return to search.

`పుష్ప‌`కు పోటీగా `గ‌ని` వ‌స్తున్నాడా?

By:  Tupaki Desk   |   16 Oct 2021 7:05 AM GMT
`పుష్ప‌`కు పోటీగా `గ‌ని` వ‌స్తున్నాడా?
X
క‌రోనా సెకెండ్ వేవ్ త‌గ్గ‌డంతో టాలీవుడ్ సినిమాల‌న్ని ఒక్కొక్క‌టిగా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలుత‌ నాగ‌చైత‌న్య న‌టించిన `ల‌వ్ స్టోరీ` డేరింగ్ గా బాక్సాఫీస్ బ‌రిలోకి వ‌చ్చి స‌క్సెస్ అయింది. ఆ సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ల‌ వైపు ధైర్యంగా అడుగులేస్తున్నార‌న్న న‌మ్మ‌కం పెరిగింది. ఆ త‌ర్వాత కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ద‌స‌రా సంద‌ర్భంగా `మ‌హా స‌ముద్రం`...`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` లాంటి చిత్రాలు కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. తొలి రోజు ఆ రెండు చిత్రాల స్పీడ్ చూస్తే జ‌నాల్లో క‌రోనా భ‌యం ఇసుమెత్తు కూడా లేద‌ని తేలిపోయింది. మాస్కులు లేకుండానే....శానిటైజేష‌న్ లేకుండా సినీ ప్రియులు వినోదం కోసం ఎగ‌బ‌డ్డారు.

దీన్ని బ‌ట్టి ఎంట‌ర్ టైన్ మెంట్ అన్న‌ది ఆడియ‌న్ ని ఎంత‌గా ఇన్ ప్లూయెన్స్ చేస్తుంది! అన్న‌ది మ‌రోసారి తేట తెల్ల‌మైంది. ఏపీ ప్ర‌భుత్వం కూడా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు ర‌న్ చేయొచ్చ‌ని ఉత్త‌ర్వులు కూడా ఇచ్చేయ‌డంతో జ‌నాలు ఎగ‌బ‌డుతున్నా రు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా వాయిదా ప‌డ్డ సినిమాల‌న్ని రిలీజ్ అవుతాయ‌ని తేలిపోయింది. అయితే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కుతోన్న `గ‌ని` కూడా తాజాగా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. డిసెంబ‌ర్ 3న రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు.

అల్లు బాబి-సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో అల్లు అర‌వింద్ పెద్ద‌కుమారుడు బాబి నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌వ్వ‌డంతో పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. స్పోర్స్డ్ డ్రామా నేప‌థ్యంలో సాగే చిత్రమిది. వ‌రుణ్ ఇందులో బాక్స‌ర్ గా క‌నిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాల‌మ‌వుతోంది. క‌రోనా కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డింది. చివ‌రిగా ప‌రిస్థితులు అనుకూలించ‌డంతో డిసెంబ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌మ‌యాత్తం అవుతున్నారని తెలిసింది. అలాగే బ‌న్ని న‌టించిన పుష్ప చిత్రాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంగా పుష్ప క్రేజ్ స్కైని ట‌చ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.