Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్..!

By:  Tupaki Desk   |   5 Aug 2021 3:44 PM GMT
మెగా ప్రిన్స్ గని రిలీజ్ డేట్ ఫిక్స్..!
X
కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ విడుదల తేదీలను బ్లాక్ చేసుకునే పనిలో ఉన్నాయి. ఇప్పటికే దసరా - సంక్రాంతి - క్రిస్మస్ కు స్టార్ హీరోలు బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. మిగిలిన దీపావళి సీజన్ కోసం మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కర్చీఫ్ వేశాడు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ''గని'' చిత్రాన్ని 2021 దీపావళి పండక్కి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈరోజు గురువారం అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా బాక్సింగ్ రింగ్ లో ఉన్న వరుణ్ తేజ్ బ్యాక్ సైడ్ పోస్టర్ ని వదిలారు. బాక్సింగ్ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతోన్న ''గని'' చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరుణ్ తేజ్ కెరీర్ లో వస్తున్న 10వ చిత్రం. అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ పిక్చర్స్ - అల్లు బాబీ కంపెనీ పతాకాలపై ఈ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి.

'గని' చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెడుతోంది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నవీన్ చంద్ర ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

'టైటాన్స్‌' 'సుల్తాన్‌' వంటి చిత్రాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ లార్నెల్‌ స్టోవల్‌ - వ్లాడ్‌ రింబర్గ్‌ ''గని'' చిత్రానికి యాక్షన్‌ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి వరుణ్‌ తేజ్‌ భారీ వర్కౌట్స్ చేసి పూర్తిగా తన బాడీ లాంగ్వేజ్‌ ని మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌ లో వేసిన స్పెషల్ సెట్‌ లో క్లైమాక్స్ ఫైట్ షూట్ చేస్తున్నారు. త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించి దీపావళికి సినిమాను రెడీ చేయనున్నారు.