Begin typing your search above and press return to search.

ప్రముఖ హీరో ఆర్యపై జర్మనీ మహిళ పోలీసులకు ఫిర్యాదు

By:  Tupaki Desk   |   2 March 2021 9:00 AM IST
ప్రముఖ హీరో ఆర్యపై జర్మనీ మహిళ పోలీసులకు ఫిర్యాదు
X
ఆ మధ్య బాలీవుడ్ డైరెక్టర్లపై పలువురు సినీ సెలబ్రెటీలు ఆరోపణలు చేశారు. ఆ తరువాత ‘మీ టూ ’ అనే సోషల్ మీడియా వార్ కొనసాగించారు. ఇందులో శ్రీరెడ్డి లాంటి వారు తమిళ నటులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తమిళ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోపై జర్మనీకి చెందిన మహిళ చేసిన ఆరోపణ చర్చనీయాంశంగా మారింది. తనను మోసం చేశాడంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంపై యంగ్ హీరో ఇంతవరకు స్పందించలేదు. ఆయన అభిమానులు మాత్రం హీరోకు సపోర్టు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఆర్య.. తమిళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘వరుడు’ సినిమాలో కరుడు గట్టిన విలన్ లా కనిపించిన ఈయన ఆ తరువాత తమిళ డబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చాలా రోజుల నుంచి వెండితెరపై కనిపించని ఆయనపై జర్మనీకి చెందిన విట్జా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీలంక పౌరురాలైన ఈమె జర్మనీలో స్థిరపడింది.

పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గత సంవత్సకాలంగా ఆర్య సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆ మధ్య కరోనా సమయంలో మరింత ఇబ్బందుల్లోకి వెళ్లాడు. ఈ సమయంలో తనకు డబ్బు అవసరముందని చెప్పడంతో విట్జా రూ.70 లక్షల 40 వేల రూపాయలు ఇచ్చింది. అప్పటి నుంచి ఆమెను పట్టించుకోవడం లేదు. ఫోన్ చేసినా స్పందించడం లేదు.

ఇందుకు సంబంధించిన చాట్స్, ట్రాన్స్ ఫర్ చేసిన డబ్బుల వివరాలు తన దగ్గర ఉందని తెలిపింది. అయితే ఓ సారి లిఫ్ట్ చేసిన ఆర్య తనను దుర్భాషలాడాడని తెలపింది. అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని పేర్కొంది. నన్నే కాకుండా ఇంకొంతమందని ఆర్య మోసం చేశాడని విట్జా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ విషయంపై నెటిజన్లు ఆర్యకు సపోర్టు చేస్తున్నారు. తనకు 2019లో నటి సాహేషాతోనే వివాహం అయిందని ఇతరులను మోసం చేయాల్సిన అవసరం ఆర్యకు లేదని పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆర్య కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడని వారు ట్రోలింగ్ చేస్తున్నారు.